Breaking News

HYD: ఈ గాలి పీలిస్తే డేంజరే..!

Published on Wed, 01/15/2025 - 07:08

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అంబరాన్నంటిన కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు ప్రయాణమైన లక్షలాది వాహనాలు వెరసి వాయు కాలుష్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. పండగకు వరుస సెలవులు తోడవడంతో హైదరాబాద్‌ నుంచి సుమారు 30 శాతం మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. దీంతో నగరంలో నడిచే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంతా భావించారు.

 స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని ఊహించారు. అయితే అవన్నీ ఊహలేనని చెబుతూ వాయు నాణ్యత ఇండెక్స్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ఏక్యూఐ (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) 151గా నమోదు కాగా, 11న మరోమారు 150ని తాకింది. వార్షిక సరాసరి 136గా నమోదైంది. 2021లో వార్షిక ఏక్యూఐ 149గా నమోదు అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఏక్యూఐ 50 లోపు ఉంటే స్వచ్ఛమైన గాలి ఉన్నట్లు లెక్క. 100 వరకు మోస్తరుగా ఉన్నట్లు. 100– 150 కి చేరితే మాత్రం నాణ్యత లోపించిందని లెక్క.

 ప్రస్తుతం నగరంలో గాలి నాణ్యత 122 నుంచి 151 మధ్య నమోదవుతోంది. ఏటా డిసెంబరు, జనవరి నెలల్లోనే గాలి నాణ్యత ఇలా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది జులైలో 53గా గాలి నాణ్యత ఉండగా, ఆరు నెలల్లోనే సుమారుగా రెండున్నర రెట్లు క్షీణించింది. ఈ వాయువులు పీలిస్తే ఆరోగ్యం చెడిపోతుందని, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 

మోత మోగిపోతోంది.. 
నగరంలో వాయు కాలుష్యానికి తోడు శబ్ద కాలుష్యం కూడా మోత మోగిస్తోంది. ఉదయం నుంచే సాధారణానికి మించి శబ్దాలు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో శబ్ద కాలుష్యం 55 డెసిబెల్స్‌ కంటే తక్కువ ఉండాలి. హైదరాబాద్‌ నగరంలో సుమారుగా 80 డెసిబెల్స్‌ వరకు ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. రాత్రి పూట ప్రధాన రహదారులపై ప్రైవేటు వాహనాలు పెద్ద శబ్దాలతో హారన్‌లు మోగిస్తున్నాయి.


 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)