Breaking News

మధ్య తరగతికీ ఇళ్లు.. వచ్చే మార్చి నాటికి లక్ష

Published on Sat, 12/06/2025 - 03:14

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజల కోసం చవకగా ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. లాభనష్టాల యోచనకు అతీతంగా ప్రభుత్వం దీన్ని చేపట్టనుందన్నారు. ఇందుకోసం అఫర్డ్‌బుల్‌ (సరసమైన) హౌసింగ్‌ పాలసీని రూపొందించనున్నట్టు వెల్లడించారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఔటర్‌ రింగు రోడ్డుకు నాలుగు వైపులా నాలుగు స్థలాలను గుర్తించామని, ఒక్కోచోట 8 వేల నుంచి 10 వేల వరకు ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో గృహనిర్మాణ శాఖ రెండేళ్ల ప్రగతిపై ఆయన విలేకరులతో మాట్లాడారు.

లీజులు చెల్లించని భూముల స్వా«దీనం: ‘గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేపీహెచ్‌బీలో నిర్మించిన హౌసింగ్‌ బోర్డు ఇళ్లల్లో శిథిలావస్థకు చేరుకున్నవాటిని గుర్తించి వాటిని తొలగించి ఆయా స్థలాల్లో హైరైజ్‌ భవనాల నిర్మాణానికి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 2 బీహెచ్‌కే ఇళ్లను రూ.700 కోట్లు వెచి్చంచి పూర్తి చేస్తున్నాం. మరో రూ.200 కోట్లతో ఆయా కాలనీలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. లీజులు చెల్లించని, కబ్జా అయిన హౌసింగ్‌ బోర్డు భూములను స్వా«దీనం చేసుకుంటున్నాం. ఇప్పటికే వెయ్యి ఎకరాల భూమికి ప్రహరీ గోడలు నిర్మించాం. ఇప్పటివరకు 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, 3 లక్షల ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్నాయి. వచ్చే మార్చి నాటికి లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయి. జూన్‌ నాటికి మరో 2 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలుంటాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గ్లోబల్‌ సమ్మిట్‌లో కూడా చర్చించనున్నాం..’అని మంత్రి తెలిపారు.

సొంతజాగా లేని వారికి మూడో విడతలో..
‘ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లంచమడిగిన 9 మంది గ్రామ కార్యదర్శులను సస్పెండ్‌ చేశాం. మరో ఇద్దరిని సరీ్వసు నుంచి తొలగించాం. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా జ్యోతి పథకం పేరుతో ఇళ్ల నిర్మాణానికి మంజూరీలు ఇచ్చిన వాటితోపాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరు పొంది అసంపూర్తిగా నిర్మాణాలను వదిలేసిన దాదాపు 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా నిర్ణయం తీసుకోనున్నాం. ఈ పథకానికి సంబంధించి రెండో విడతలో కూడా సొంత జాగా ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటాం. సొంతజాగా లేని వారికి మూడో విడతలో మంజూరు చేస్తాం. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్లస్‌ 4 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే విధంగా త్వరలో ఇందిరమ్మ అర్బన్‌ హౌసింగ్‌ పాలసీని ప్రకటించబోతున్నాం..’పొంగులేటి చెప్పారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో భూముల కన్వర్షన్‌
‘గతంలో పారిశ్రామిక భూములను నివాస ప్రాంత భూములుగా మార్చిన విషయాన్ని, అస్మదీయులకు కట్టబెట్టిన విషయాన్ని కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ నేతలు మరిచిపోయి, ఇప్పుడు హిల్ట్‌ పాలసీపై విమర్శలు చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ నిర్వహణను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి కేసీఆర్, కేటీఆర్‌లు కావలసిన వారి దగ్గర ముడుపులు తీసుకొని భూములను కన్వర్ట్‌ చేశారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది ఎకరాలు వేలం వేశారు. గతంలో ఎల్‌బీనగర్‌లోని దాదాపు 40 ఎకరాల స్ధలాన్ని పీవీ రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇవ్వగా, భూగర్భ జలాలు కలుíÙతమయ్యాయని ప్రజలు ఆందోళన జరిపారు. ఈ పారిశ్రామిక భూములను రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చింది బీఆర్‌ఎస్‌ కాదా? ఈ ఫైలుపై తండ్రీ కొడుకులు సంతకాలు చేయలేదా? ఐడీపీఎల్‌లో కూడా ఇదే విధంగా చేశారు. హిల్ట్‌ పాలసీపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకే స్క్రిప్టుతో డ్రామాలాడుతున్నాయి..’అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)