Breaking News

‘పవన్‌ పెట్రోల్‌ బంక్‌’లో కల్తీ పెట్రోలు..!

Published on Fri, 09/12/2025 - 17:39

శేరిగూడ, రంగారెడ్డి జిల్లా:  రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్న మున్సిపల్‌ పరిధిలోని శేరిగూడ సమీపంలోని ‘పవన్‌ పెట్రోల్‌ బంక్‌’లో  కల్తీ చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.  ఓ కారుకు  ఆ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ కొట్టించిన అనంతరం ఆగిపోయింది. పెట్రోల్‌ కొట్టించిన తర్వాత కారు ఆగిపోవడంపై అనుమానం వచ్చింది సదరు కారు యజమానికి. 

నిన్న(గురువారం, సెప్టెంబర్‌ 11వ తేదీ) రాత్రి పెట్రోల్‌ కొట్టించిన తర్వాత కారు ఆగిపోవడంతో బంక్‌ సిబ్బంది మార్నింగ్‌ రమ్మన్నారు. ఇక చేసేది లేక ఆ కారును అక్కడే వదిలేసి వేరే కారులో వారు వెళ్లిపోయారు. ఈ రోజు ఉదయం  కారును తీసుకెళ్లడానికి వచ్చిన సమయంలో పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌.. తమ ఓనర్‌ వస్తారని, అప్పటిదాకా వెయిట్‌ చేయాలని చెప్పినట్లు కారు బాధితుడి తెలిపాడు.

అయితే మధ్యాహ్నం అయినా బంక్‌ యజమాని రాకపోవడంతో ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తాము ఫుల్‌ ట్యాంక్‌ చేయించుకున్న తర్వాత కారు ఆగిపోవడంతోనే అనుమానం వచ్చిందని, అయితే చేసేది లేక అప్పుడు వెళ్లిపోయి, మళ్లీ ఈరోజు వచ్చామన్నారు. తమను పట్టించుకోకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు లైవ్‌లోనే పెట్రోల్‌ తీస్తే అసలు విషయం బయటపడింది. తనిఖీలో భాగంగా బాటిల్‌లో తీసిన పెట్రోల్‌లో సగానికి పైగా నీళ్లే ఉన్నాయని, అందుచేత తమ కారు ఆగిపోయిందని తెలిపాడు. ఇలాగే చాలామంది తమ వాహనాలు దారిలో ఆగిపోవడంతో మళ్లీ బాటిల్స్‌ పట్టుకుని ఆ బంక్‌కు  వచ్చిన సంగతిని బాధితుడు తెలిపాడు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)