Breaking News

బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు

Published on Tue, 04/22/2025 - 06:24

సాక్షి, హైదరాబాద్‌: బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

జూనియర్‌ ఇంటర్మిడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీలతో అగ్రికల్చర్‌ – క్రాప్‌ ప్రొడక్షన్, కంప్యూటర్‌ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్, కమర్షియల్‌ గార్మెంట్‌ టెక్నాలజీ, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్‌ కాలేజీలలో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్‌ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ https:// mjptbcwreis. telangana.gov.in (ro) https:// mjpabcwreis. cgg.gov.in/ TSMJBCWEB/ లో లేదా 040–23328266 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు 10వ తరగతి చదివిన గురుకుల స్కూల్‌లో సంబంధిత ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని వివరించారు. 

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)