Breaking News

Telangana: ప్రకృతి ఒడిలో 'పొచ్చెర' అందాలు..

Published on Tue, 07/30/2024 - 10:58

ఆదిలాబాద్: పొచ్చర జలపాతం అందాలు పర్యాటకులను కట్టిçపడేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతానికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో జలపాతం వద్ద పెద్ద బండరాళ్లపై పడుతున్న నీరు, వచ్చే నీటి తుంపరులు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. జిల్లా నుంచే కాకుండా  ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.

ఆహ్లాద వాతావరణం..
పొచ్చర జలపాతం అందాలు, పచ్చని వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. జలపాతాన్ని చూడటంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వచ్చిన పర్యాటకులు íవీకెండ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో పొచ్చెర జలపాతం మంచి పిక్నిక్‌ స్పాట్‌గా ఏర్పడింది. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన గంగాదేవి, వన దేవత విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు విగ్రహాలతో ఫొటోలు తీసుకుంటున్నారు.

‘పొచ్చర’కు ఇలా చేరుకోవాలి..
బోథ్‌ మండలంలోని పొచ్చర జలపాతానికి నిర్మల్‌ నుండి వచ్చే వారు జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండల కేంద్రం మీదుగా రావాలి. నేరడిగొండ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడమ వైపు బోథ్‌ ఎక్స్‌ రోడ్డు ఉంటుంది. ఎడమ వైపు తిరిగి అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు పొచ్చర జలపాతానికి దారి వస్తుంది. కిలో మీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు. ఆదిలాబాద్‌ నుంచి వచ్చే వారు 44వ జాతీయ రహహదారిపై  ఆదిలాబాద్‌ నుంచి 45 కిలోమీటర్లు ప్రయాణించి బోథ్‌ ఎక్స్‌ రోడ్డు కుడివైపు రావాలి. అక్కడి రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కుడివైపు జలపాతానికి దారి వస్తుంది. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో జలపాతానికి చేరుకోవచ్చు.

సహజసిద్ధమైన అందాలు..
పొచ్చర వద్ద సహజ సిద్ధమైన అందాలు బాగున్నాయి. జలపాతం వద్ద బండరాళ్లపై నీరు జారిపడినప్పుడు వచ్చే శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి. పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కూర్చోవడానికి కుటీరాలు ఏర్పాటు చేశారు. కుటుంబంతో వచ్చి చూడాల్సిన ప్రాంతం ఇది. – గోపిడి రమేశ్‌రెడ్డి, జగిత్యాల

ఆహ్లాదకరంగా ఉంది..
నేను వరంగల్‌ నుంచి వచ్చా. జతపాతం అందాలు చాలా బాగున్నాయి. ఆహ్లదకరంగా ఉంది. వీకెండ్‌లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాంతం. ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మా కుటుంబంతో మళ్లీ వచ్చి చూస్తాం. – ప్రియాంక, వరంగల్

ఇవి చదవండి: మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)