Breaking News

ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి

Published on Thu, 08/14/2025 - 04:26

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో నటి మంచు లక్ష్మి బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈడీ అధికారుల బృందం ఆమెను ప్రశ్నించింది. ‘యో 247’ అనే బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ వివరాలు సేకరించింది. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్‌ లావాదేవీల ఆధారంగా ప్రశ్నించింది. 

లక్ష్మి చెప్పిన వివరాలతో దాదాపు మూడు గంటల పాటు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. ప్రధానంగా మంచు లక్ష్మి ప్రమోట్‌ చేసిన యాప్‌కు అనుమతులు ఉన్నాయా అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. ప్రమోట్‌ చేసినందుకు ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారనే వివరాలను ఈడీ అధికారులు సేకరించినట్లు సమాచారం. 

బెట్టింగ్‌ యాప్‌ నుంచి మంచు లక్ష్మి బ్యాంక్‌ అకౌంట్లలోకి జరిగిన లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. పారితోషికం, కమీషన్లకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసినట్లు సమాచారం. కొన్ని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించాలని ఆమెకు ఈడీ బృందం సూచించినట్లు తెలిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)