Breaking News

కైసే హే ఆప్‌..

Published on Sat, 07/06/2024 - 11:24

కుమారి ఆంటీ.. కైసే హే ఆప్‌ అంటూ ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. మాదాపూర్‌ స్ట్రీట్‌ ఫుడ్‌కు పేరుగాంచిన కుమారీ ఆంటీ గురించి అందరికీ తెలిసిందే. కుమారి ఆంటీ హోటల్‌ను సోనూ సూద్‌ శుక్రవారం సందర్శించి, ఆమెతో ముచ్చటించారు. అంతేకాకుండా స్వయం కృషితో ఎదిగి, మహిళా సాధికారతకు  నిదర్శనంగా నిలిచారన్నారు. కుటుంబం కోసం కష్టపడుతున్న తీరు ఆదర్శనీయమని అన్నారు. 

హోటల్లో ఎలాంటి వంటకాలు అందుబాటులో ఉంటాయో అడిగి తెలుసుకున్నారు. రూ.80కి వెజ్, రూ.120కి నాన్‌ వెజ్‌ లభిస్తాయని తెలిపారు. తను శాకాహారినని, తనకైతే వెజ్‌మీల్‌ ఎంతకు అమ్ముతావని సోనూ అడిగారు. దీనికి సమాధానంగా...ఎంతో మందికి సహాయం చేసిన మీకు ఏదైనా ఉచితంగానే ఇస్తానని తన అభిమానాన్ని చాటుకున్నారు. తను కష్టకాలంలో ఉన్నప్పుడు సోనూ సూద్‌ స్వయంగా ఫోన్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తోడా, తోడా హిందీ మాత్రమే వస్తుందని కుమారి ఆంటీ తెలుపగా.. ‘మీ హిందీ చాలా బాగుంది’ అని సరదాగా కితాబిచ్చారు. 

అనంతరం ఆమె పిల్లల గురించి పలు విషయాలు తెలుసుకున్నారు. ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ కాసేపు సందడి చేశారు. సోనూ సూద్‌ ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నగరానికి వచ్చారు. ఏదేమైనా..పట్టుదల, కృషితో ముందుకొచ్చే వారిని గుర్తించడం, ప్రోత్సాహమందించడంలో సోనూ తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకున్నారు. అయితే కుమారి ఆంటీని కలిసిన వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)