Breaking News

ఎక్కడ దాక్కున్నాడో?

Published on Fri, 07/03/2026 - 13:56

హైదరాబాద్‌, మణికొండ: నెల రోజుల పాటు రెక్కీ వేసి ఈగల్‌ టీం అరెస్టు చేసిన డ్రగ్స్‌ వ్యాపారి సయ్యద్‌ మహ్మద్‌ ముజఫర్‌ ఆలీ ఆచూకీని నార్సింగి పోలీసులు కనిపెట్టలేకపోయారు. బుధవారం తెల్లవారుజామున అతను తప్పించుకున్నప్పటి నుంచి ఈగల్‌ టీంతో పాటు నార్సింగి పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

పోలీస్‌ స్టేషన్‌ బాత్‌రూం వెంటిలేటర్‌ ద్వారా అతను బయట పడి, ఏడు అడుగుల ఎత్తు ఉన్న పోలీస్‌ స్టేషన్‌ ప్రహరీ దూకి ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుపైకి పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సర్వీస్‌ రోడ్డుపై వస్తున్న ఓ క్యాబ్‌ను ఆపి అందులో అత్తాపూర్‌లోని లెనిన్‌నగర్‌కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించి క్యాబ్‌ డ్రైవర్‌ను విచారించిన విషయం తెలిసిందే. నిందితుని వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడం, అతని తల్లి, సోదరున్ని పోలీసులు ఇప్పటికే రిమాండ్‌కు తరలించడంతో అతని కదలికలను కనుక్కోవడం కష్టతరంగా మారింది.

ఉన్నతాధికారులు సీరియస్‌ 
ఈగల్‌ టీం శ్రమించి పట్టుకున్న నిందితుడు నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకోవటంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌ అయినట్టు తెలిసింది. నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ను మందలించడంతో పాటు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. నిందితుడు తప్పించుకునే సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ అంజయ్యకు మెమో జారీ చేసినట్టు తెలిసింది. ‘‘నిందితుడు మూత్రం వస్తుందంటూ చెప్పడంతో బాత్‌రూంకు తీసుకెళ్లాను. అతను వెంటిలేటర్‌ ద్వారా పారిపోతాడని ఊహించలేదు’’ అని ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్టు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)