Breaking News

ఫార్ములా ఈ– కారు రేసుపై ఏసీబీ నివేదిక

Published on Wed, 09/10/2025 - 04:44

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ–కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిధుల బదలాయింపులో తీవ్ర ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, హెచ్‌ఎండీఏ నిధులు దురి్వనియోగం అయ్యాయని అవినీతి నిరోధక శాఖ తేల్చినట్టు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా, సంబంధం లేని విభాగం నుంచి నిధులను ఫార్ములా ఈ– కారు రేసుకు బదిలీ చేయడం వెనుక క్విడ్‌ ప్రో కో జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. 

రూ.55 కోట్ల హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ తుది నివేదిక అందించింది. ఈ కేసులో విధానపరమైన లోపాలు ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో తొలిసారి 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ–కారు రేసు సంస్థ రేసును నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్పాన్సర్లతో తొలి రేసు నిర్వహించినా, అందుకు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. తొలిసారి స్పాన్సర్లుగా వ్యవహరించిన సంస్థలకు ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతో... 2024లో నిర్వహించాల్సిన రెండో రేసు నుంచి స్పాన్సర్లు తప్పుకున్నారు. 

రేసు నిర్వహణకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఫార్ములా ఈ– కారు రేసు నిర్వాహకులు వెంటనే నిధులు ఇస్తే తప్ప.. 2024 ఫిబ్రవరిలో రేసు కేటాయించడం సాధ్యం కాదంటూ ఒత్తిడి తేవడం, స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో అప్పట్లో హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ–కారు రేసు సంస్థకు విదేశీ కరెన్సీలోనే నిధులు చెల్లించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కూడా తీసుకోలేదని, ఆర్థికశాఖ నుంచి కూడా అనుమతి తీసుకోలేదని తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికారం మారడంతో...ఫార్ములా ఈ– కారు రేసును రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 

ఎన్నికల సమయంలో హెచ్‌ఎండీఏ నుంచి నిధులు విదేశాలకు తరలివెళ్లాయని తెలియడంతో.. అప్పటి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌ ఈ నిధులు మళ్లింపుపై విచారణ చేయాలని అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ తర్వాత ఎసీబీ అధికారులు అప్పట్లో పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ను రెండుసార్లు, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను మూడుసార్లు, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డిలను మూడుసార్లు ప్రశ్నించింది. 

ఎస్‌ నెక్స్ట్ జెన్‌తోపాటు ఫార్ములా ఈ–కారు రేసు ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసిన ఏసీబీ అందులో ప్రధానంగా మాజీమంత్రి కేటీఆర్, అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్‌కుమార్‌లను ముద్దాయిలుగా పేర్కొన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. వారిపై ప్రాసిక్యూషన్‌ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)