Breaking News

12 గంటలపాటు ప్రశ్నల వర్షం!

Published on Sun, 10/08/2023 - 08:10

హైదరాబాద్: పబ్‌ యజమానిని మామూళ్ళ కోసం పీడించి వేధించిన ఘటనలో ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 12 మంది సభ్యులతో కూడిన ఏసీబీ బృందం ప్రశి్నంచింది. పలు రికార్డులను, ఫోన్‌ కాల్, వాట్సాప్‌ రికార్డులు వారి ముందే పరిశీలించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు ఏకధాటిగా వీరిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. తనను వేధిస్తున్నట్లు ఆరోపించిన బంజారాహిల్స్‌లోని రాక్‌ క్లబ్‌ పబ్‌ యజమానిని అర్ధరాత్రి ఒంటిగంటకు స్టేషన్‌కు పిలిపించారు. 

గత శనివారం పబ్‌ నుంచి తనను ఎలా తీసుకొచ్చింది, ఎలా నిర్బం«ధించింది పబ్‌ యజమాని లక్ష్మణ్‌ రావు ఏసీబీ అధికారులకు పూసగుచ్చినట్లుగా వివరించారు. అకారణంగా తనను పబ్‌నుంచి తీసుకొచ్చారని, అంతకు కొద్ది రోజుల ముందు నుంచే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని చాటింగ్‌ వివరాలను ఆధారాలతో సహా ఏసీబీకి అందజేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. సీఐ నరేందర్, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి వాట్సాప్‌ మెసేజ్‌లతో పాటు వాట్సాప్‌ కాల్స్‌ వివరాలను కూడా అధికారులు తెప్పించి..వారి ముందే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఈ ముగ్గురినీ ఏసీబీ కార్యాలయానికి తరలించి 41ఏ నోటీసులు అందజేశారు. ఈ నెల 9వ తేదీన తదుపరి విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించారు. అక్కడి నుంచే సీఐతో పాటు ఎస్‌ఐ క్యాబ్‌లు బుక్‌ చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.   

మొదలైన పైరవీలు.. 
బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌పై ఏసీబీ ఆరోపణలు రావడంతో దాదాపు ఆయనను పదవి నుంచి తొలగించడం ఖాయంగా కనిపిస్తున్నది. అప్పుడే ఈ పోస్టు కోసం కొందరు సీఐలు పైరవీలు మొదలు పెట్టారు. సమర్ధుడైన అధికారిని రాజకీయాలతో సంబంధం లేకుండా పోస్టింగ్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రలోభాలతో స్టేషన్‌ పరువు ప్రతిష్టలు దిగజారుతున్నట్లుగా అధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతో పోస్టింగ్‌లు దక్కించుకుంటున్న సీఐలు తమను ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో బంజారాహిల్స్‌ పోస్టింగ్‌ నేరుగా ఇవ్వాలని, రాజకీయ నాయకులకు తలొగ్గద్దని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు ఇక్కడికి వచ్చేందుకు పోలీసు అధికారులతోనే పైరవీ చేస్తున్నట్లు సమాచారం.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)