Breaking News

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ సీనియర్‌ అసిస్టెంట్‌

Published on Wed, 07/02/2025 - 10:04

కూకట్‌పల్లి(హైదరాబాద్): లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఉద్యోగి సునీత ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..  మూసాపేట సర్కిల్‌ పరిధిలోని రెవెన్యూ విభాగంలో సునీత సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ బాధితుడు మూసాపేటలో తన తల్లిదండ్రులకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ను తన పేరు మీద మ్యుటేషన్‌ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించాడు. రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న సునీత తనకు సంబంధించిన విధులు కాకపోయినప్పటికీ.. 

ఈ విషయంలో కలుగజేసుకుని.. ఆస్తి పన్ను మ్యుటేషన్‌ చేసేందుకు రూ.80 వేలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఇచ్చిన కరెన్సీ నోట్లను తీసుకుని మొదటి విడతగా రూ.30 వేలు ఆమెకు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు సునీతతో పాటు రెవెన్యూ శాఖలో పని చేసే పలువురిని ప్రశ్నించినట్లు తెలిసింది. లంచం విషయంలో కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఏసీపీ అధికారులు అనుమానిస్తున్నారు.  ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో సర్కిల్‌ కార్యాలయంలో వివిధ చోట్ల సోదాలు చేశారు. ఈ మేరకు సునీతను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

నర్సారెడ్డి వర్సెస్ మైనంపల్లి కుటుంబం.. మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)