Breaking News

ఏసీబీ వలలో మున్సిపల్‌ అధికారి.. కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు

Published on Fri, 08/09/2024 - 16:59

సాక్షి, నిజామాబాద్‌: అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ గుబులు పుట్టిస్తోంది. తాజాగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్‌ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల్ని గుర్తించారు. మొత్తం రూ. 6.70 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఏసీబీ సోదాల్లో రూ.2కోట్ల 93లక్షల 81వేల నగదు, నరేందర్ బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి 10 లక్షల నగదు,  అరకిలో బంగారు ఆభరణాలు, 1కోటి 98 లక్షల విలువ చేసే ఆస్తుల్ని సీజ్‌ చేశారు.  మొత్తం 6కోట్ల 7లక్షల విలువగల ఆస్తుల గుర్తించారు. ఆదాయం మించిన ఆస్తుల కేసులో నరేందర్‌పై  కేసు నమోదు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుంది. 

ప్రస్తుతం మున్సిపల్ అధికారి నరేందర్ బంధువుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నరేందర్‌ను అరెస్ట్‌ చేసిన అధికారులు హైదారాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)