Breaking News

ఎవరినీ వదిలిపెట్టను..

Published on Tue, 04/30/2024 - 05:42

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తన కేసుపై వచ్చిన ఓ పోస్టుకు.. ‘ఎవరినీ వదిలిపెట్టను’.. అంటూ సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోస్టు పెట్టా­రని.. ఓ ఉన్నతస్థాయి అధికారి ఇలా మెసేజ్‌ పెడితే ఆయన­పై కేసుల్లో దర్యాప్తు అధికారులు పారదర్శక విచారణ ఎలా చేయగలరని క్యాట్‌ (సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌)లో ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపించారు. ఆలిండియా సర్వీసెస్‌లోని నిబంధనల మేరకే ప్రభు­త్వం ఆయనపై సస్పెన్షన్‌ విధించిందన్నారు.

కేంద్రం అను­మతి లేకుండా ఇజ్రాయిల్‌ నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు తెచ్చినట్లు, అందులోనూ అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఏబీవీను సస్పెండ్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ తర్వాత ‘సుప్రీం’ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. విధుల్లో చేరిన తర్వాత తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రెస్‌మీట్ల ద్వారా ట్యాపింగ్‌ కేసు­లో సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్ర­భు­త్వం మరోసారి సస్పెండ్‌ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ వెంకటేశ్వరరావు ఏప్రిల్, 2023లో క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జ్యుడీషియల్‌ సభ్యురాలు లతా బస్వరాజ్‌ ప­ట్నే, నాన్‌–జ్యుడిషీయల్‌ సభ్యురాలు శాలినీ మిస్త్రా ధర్మా­సనం సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. 

సాక్షులను బెదిరించే ప్రయత్నం.. 
‘రెండుసార్లు విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు వాడిన భాష సమర్థనీయం కాదు.. ఫోన్‌ ట్యాపింగ్, ఆవినీతి కేసుపై ‘ఆవుకథ, నాలుగు కాళ్ల జంతువు’ లాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలపై, కొందరు అధికారులపై అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇదంతా అన్ని పత్రికలు, చానల్‌లో ప్రసారమైంది. కేసుకు ఎప్పుడు ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానన్నారు. అంశాలను కొందరు సోషల్‌ మీడి­యా­లో పెట్టగా.. ఎవరినీ వదిలిపెట్టను అని వెంకటేశ్వరరావు థంబ్‌నెయిల్‌ పెట్టారు.

ఓ సీనియర్‌ ఐపీఎస్‌ ఇలా పెడితే సాక్షులు, విచారణాధికారులు ప్రభావితమవుతారు. ఆయన­ను విధుల్లో కొనసాగిస్తే విచారణ పారదర్శకంగా సాగే అవ­కాశంలేదు. అలాంటప్పుడు వారిపై చర్యలు తీసుకునే అధి­కారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది’.. అని ఏజీ వాదించారు.

రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టులు..
‘నిజానికి.. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం.. క్రిమినల్‌ అభియోగాలన్నీ తొలగిపోయే వరకు లేదా కొట్టేసేవరకు వారిపై సస్పెన్షన్‌ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. గతంలో సుప్రీంకోర్టు, ఏపీ, బాంబే, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌ హైకోర్టులు తీర్పులిచ్చాయి (వాటిని చదివి వినిపించారు). క్రమశిక్షణా చర్యల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది’.. ఏజీ వాదనలు వినిపించారు. అనంతరం వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు విన్న బెంచ్‌.. వెంకటేశ్వరరావు ప్రెస్‌మీట్‌ ఆడియో కాపీని అందజేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, తీర్పు రిజర్వు చేసింది.   

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు