Breaking News

మితిమీరిన వేగంతోనే ముప్పు

Published on Mon, 12/09/2024 - 06:02

సాక్షి, హైదరాబాద్‌:  ‘స్పీడ్‌ థ్రిల్స్‌..బట్‌ కిల్స్‌..’(వేగం ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ చంపేస్తుంది) అని పోలీసులు చెబుతున్నా, రహదారులపై అక్కడక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నా.. కొందరు వాహనదారులు చెవికెక్కించుకోవడం లేదు. విశా లమైన రోడ్లపై యమస్పీడ్‌గా దూసుకెళుతున్నారు. అంతే వేగంగా ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలకు కారణాలు విశ్లేíÙస్తే.. మితిమీరిన వేగంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడవుతోంది. 

రోడ్డు ప్ర మాదాలు నియంత్రించేందుకు, ప్రమాదాలకు మూలకారణాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ పోలీస్‌శాఖ రోడ్డు భద్రత విభాగం అధికారులు 2023లో రాష్ట్ర పరిధిలోని జాతీ­య రహదారులు, రాష్ట్ర రహదారులు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాల గణాంకాలు విశ్లేíÙంచారు. రహదారులు, ఓఆర్‌ఆర్‌పై మొత్తం 9,749 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఇందులో 5,817 రోడ్డు ప్రమాదాలు వాహనదారుల మితిమీరిన వేగం కార­­ణంగానే సంభవించినట్టు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో 120 రోడ్డు ప్రమాదా లు జరిగాయి. అత్యంత నిర్లక్ష్యంగా వాహనా న్ని నడపడంతో 3,532 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమా­దా­లకు అసలు కారణాలు గుర్తించడం ద్వారా వాటిని నివారించేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.  

3,532 నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో యాక్సిడెంట్లు
⇒ 2023లో జరిగిన ప్రమాదాలను విశ్లేషించిన పోలీస్‌శాఖ రోడ్డు భద్రత విభాగం 
⇒  ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టే యోచన 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)