Breaking News

వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్‌.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం

Published on Sat, 01/21/2023 - 09:12

సాక్షి, హైదరాబాద్‌: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్‌ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్‌తో పాటు, లక్కీ నంబర్‌, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్‌తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే..  ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. 

తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ప్రతి సిరీస్‌లో ఎంతో డిమాండ్‌ ఉండే ఆల్‌నైన్‌ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్‌లకు నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో  ‘టీఎస్‌ 09 ఎఫ్‌జడ్‌ 9999’ నెంబర్‌కు ప్రీమియర్‌ ఇన్‌ఫోసిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది.

అలాగే ‘టీఎస్‌ 09 జీఏ 0001’ నెంబర్‌ కోసం రాజేశ్వరి స్కిన్‌ అండ్‌ ఎయిర్‌క్యూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆన్‌లైన్‌ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్‌09 జీఏ 0009’ నెంబర్‌ కోసం ఎం.వెంకట్రావు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్‌09 జీఏ 0007’ నెంబర్‌ కోసం స్నేహ కైనెటిక్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,35,007 చెల్లించి నెంబర్‌ను దక్కించుకుంది. ‘టీఎస్‌ 09 జీఏ 0003’ నెంబర్‌ కోసం ధని కన్సల్టేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్‌లపైన  శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్‌ జేటీసీ పాండురంగ్‌నాయక్‌ తెలిపారు.    

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)