Breaking News

కల్తీ నెయ్యిపై ఉక్కుపాదం.. 850 కిలోలు సీజ్‌

Published on Sat, 07/18/2026 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కల్తీ నెయ్యి త­యా­రీ, విక్రయాలపై ఫుడ్‌ సేఫ్టీ శాఖ ఉక్కుపా­దం మోపింది. నెయ్యిలో పామాయిల్, వన­స్పతి వంటి ఇతర కొవ్వులు కలుపుతున్నారన్న సమాచారంతో ఈనెల 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ తెలిపారు. హైదరా­బాద్‌ క్యూర్‌ ప్రాంతంలోని 14 సంస్థల్లో తనిఖీ­లు చేపట్టి 15 నెయ్యి నమూనాలు సేకరించారు. వినియోగానికి పనికిరాదని గుర్తించిన 60 కిలోల నెయ్యిని అక్కడికక్కడే ధ్వంసం చేయగా, 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వా«దీనం చేసుకున్నారు. 

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 65 సంస్థలను పరిశీలించి 91 నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు సంస్థలకు నోటీసులు జారీచేశారు. పామాయిల్‌ లేదా వనస్పతి వంటి వృక్షజన్య కొవ్వులు కలపడం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం–2006 ప్రకారం నిషేధమని కమిషనర్‌ వివరించారు. అనుమానాస్పద ఆహార ఉత్పత్తులపై వెంటనే ఫుడ్‌ సేఫ్టీ శాఖకు ఫిర్యాదు చేయాలని సంగీత సత్యనారాయణ సూచించారు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)