Breaking News

తల్లి కోరిక.. కొడుకు కానుక

Published on Tue, 12/16/2025 - 07:28

మేడిపల్లి: వారిది నిరుపేద కుటుంబం. గౌడవృత్తితోపాటు ఉన్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గ్రామానికి ఎప్పటికైనా సర్పంచ్‌ కావాలని ఆ ఇంటి యజమాని కల కనేవాడు. అలా ప్రతిసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవాడు. ఆర్థికంగా లేకపోవడంతో ప్రతిసారీ ఓడిపోయాడు. తన భర్త చివరి కోరికను కొడుకుకు చెప్పగా.. పట్టువదలని విక్రమార్కుడిలా ఈసారి ఎన్నికల్లో తల్లిని సర్పంచ్‌ చేశాడు. 

వివరాల్లోకి వెళితే... ఇది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కమ్మరిపేట.. భీమారం మేజర్‌ గ్రామ పంచాయతీలో విలీన గ్రామంగా ఉండేది. గ్రామానికి చెందిన కోటగిరి గంగరాజం, గంగరాజు (గంగవ్వ) దంపతులు. గంగరాజంకు ఎప్పటికైనా సర్పంచ్‌ కావాలనే కోరిక ఉండేది. అలా చాలాసార్లు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ కోరిక తీరకుండానే గంగరాజం 2009లో చనిపోయారు. ఆ తర్వాత కమ్మరిపేట ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. 

ప్రస్తుతం గంగవ్వ వయస్సు 82 ఏళ్లు. రెండో విడత ఎన్నికలు రాగానే తండ్రి కోరికను కొడుకు లింగగౌడ్‌కు చెప్పింది. దీంతో తండ్రి కోరికను తల్లితోనైనా తీర్చాలనే ఉద్దేశంతో సర్పంచ్‌గా పోటీలో నిలబెట్టారు. నలుగురు పోటీలో ఉండగా.. గంగవ్వ స్వతంత్ర అభ్యర్థిగా 332 ఓట్లు సాధించింది. 128 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలిచింది. 

విషయం తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆమెను కరీంనగర్‌లోని ఆయన కార్యాలయానికి సోమవారం పిలిపించుకున్నారు. ఘనంగా సన్మానించారు. తన భర్త కోరికను కొడుకు ద్వారా తీరిందంటూ ఆ తల్లి బండి సంజయ్‌ ఎదుట ఆనందబాష్పాలు రాలి్చంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)