Breaking News

75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా..

Published on Sat, 07/06/2024 - 11:16

ఆయనకు సరిగ్గా 75 ఏళ్లు.. అయితేనేం..? నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడితేగానీ నేటితరం యువత సాధించలేని సిక్స్‌ప్యాక్‌ను నలభై ఏళ్ల క్రితమే తన సొంతం చేసుకున్నాడు. వృద్ధాప్యంలోనూ సిక్స్‌ప్యాక్‌ను కాపాడుకుంటూ నేటితరం యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే సికింద్రాబాద్‌ ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన విజయ్‌కుమార్‌. అనేక కారణాలతో నేటి తరం యువత తమ సిక్స్‌ప్యాక్‌ కలను సాధించలేకపోతున్నారు.

సిక్స్‌ప్యాక్‌ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు తప్పనిసరి. ఎన్ని కసరత్తులు చేసినా సిక్స్‌ప్యాక్‌ సాధ్యం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇటువంటి కఠోర వ్యాయామాలను సునాయసంగా చేస్తూ తన సిక్స్‌ప్యాక్‌ను నేటికీ పదిలపరుచుకుంటున్నారు. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదు అంటున్న విజయ్‌కుమార్‌ ఈ వయసులోనూ హుషారుగా వ్యాయామాలు చేస్తున్నారు.. ర్యాంప్‌వాక్‌లు సైతం చేయవచ్చని నిరూపిస్తున్నారు. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లడం, వ్యాయామంతోపాటు జాగింగ్, సైక్లింగ్‌ చేస్తూ ఎందరో యువకులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ కండలవీరుడు విజయ్‌కుమార్‌పై సాక్షి కథనం..    

సునాయాసంగా 
కఠోర ఆసనాలు 
28 ఏళ్ల వయస్సు 
నుంచే వ్యాయామాలు

ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన ఎం.విజయ్‌కుమార్‌ నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని దరిచేరకుండా జాగ్రత్తపడుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి సుచిత్ర వరకూ, ప్యారడైజ్‌ నుంచి బొల్లారం వరకూ, మారేడుపల్లి నుంచి బాలానగర్‌ వరకూ ఉన్న జిమ్‌ నిర్వాహకులకు, అందులో శిక్షణ తీసుకుంటున్న యువతకు సుపరిచితులు. సికింద్రాబాద్‌లో ఇంజినీరింగ్‌ వ్యాపారంలో స్థిపరడిన విజయ్‌కుమార్‌ తన 28 ఏళ్ల వయసు నుంచే వ్యాయాయం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ వ్యాపారాన్ని కొనసాగించిన ఆయన ప్రస్తుతం వ్యాయామంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  

సీనియర్‌ సిటిజన్స్‌లోనూ...
కొద్ది సంవత్సరాలుగా స్నేహ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధిగా కొనసాగుతున్న విజయ్‌కుమార్‌ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. డీజే పాటలకు డ్యాన్స్‌ చేయడం, స్వతహాగా పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అటు వృద్ధుల్లో ఇటు యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జిమ్‌ వర్కవుట్‌తోపాటు జాగింగ్, సైక్లింగ్‌ పోటీల్లోనూ పలు మెడల్స్‌ను అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన బాడీబిల్డింగ్, సైక్లింగ్‌ పోటీల్లో నేటికీ పాల్గొంటుంటారు.

అందరూ క్రీడాకారులే... 
వ్యాయామం, క్రీడలు విజయ్‌కుమార్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు అలవాటయ్యాయి. విజయ్‌కుమార్, భార్య పిల్లలు కూడా ఉదయం నిద్రలేచింది మొదలు వర్కవుట్స్‌ చేయడం వారి దినచర్య. భార్య శారద కూడా భర్తకు తోడుగా వాకింగ్, జాగింగ్‌లకు వెళతారు. సీనియర్‌ సిటిజన్స్‌ క్రీడల్లో శారద పలు పతకాలు గెలుచుకుంది. కూతురు వాణి వాలీబాల్‌ జాతీయ క్రీడాకారిణిగా అవార్డులు అందుకుంది. కుమారులు పవన్, నవీన్‌ ఇరువురూ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మర్లు. పెద్దకుమారుడు ఆ్రస్టేలియాలో స్థిరపడగా చిన్నకుమారుడు స్విమ్మింగ్‌ కోచ్‌గా ఉన్నాడు.

ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ...
సికింద్రాబాద్‌ ప్రాంతంలో విజయ్‌కుమార్‌ వర్కవుట్‌ చేయని జిమ్, సైక్లింగ్‌ చేయని రోడ్డు, జాగింగ్‌ చేయని మైదానం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వర్కవుట్‌ చేయడంతో పాటు అక్కడి యువకులకు వర్కవుట్‌లో మెళకువలు నేర్పుతుంటారు. ఇంటి ఆహారం అందులోనూ శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవడం పట్ల అవగాహన కలిగిస్తున్నారు.

శేషజీవితం సమాజానికి అంకితం 
నిరంతర వ్యాయామంతో వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. ప్రస్తుతం కుటుంబ, వ్యాపార బాధ్యతలు ఏవీ నాపై లేవు. శేష జీవితం సమాజాభివృద్ధికి అంకితం చేయాలన్నదే లక్ష్యం. సీనియర్‌ సిటిజన్లలో నిరాశ, నిస్పృహలను దూరం చేసేందుకు చేతనైన సహాయం చేస్తున్నా. 
– మందుల విజయ్‌కుమార్‌ 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)