Breaking News

ఆల్మట్టి గేట్లు ఎత్తారు

Published on Wed, 07/17/2024 - 04:55

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో సోమవారం విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,04,050 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 1,698.95 అడుగుల్లో 100 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో.. బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల మహారాష్ట్ర లో ముంపు సమస్య ఉత్పన్నం కాకుండా నివారించేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి గేట్లను ఎత్తి 65 వేల క్యూసెక్కులు దిడువకు విడుదల చేస్తున్నారు. గతేడాది జూలై 27న ఆల్మట్టి డ్యామ్‌ గేట్లు ఎత్తారు. 

ఈ ఏడాది 11 రోజుల ముందుగానే గేట్లు ఎత్తడం గమనార్హం. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్‌ డ్యామ్‌లోకి వరద చేరుకుంటోంది. ప్రస్తుతం నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 22,621 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 1608.2 అడుగుల్లో 28.76 టీఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్‌ డ్యామ్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1,615 అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు. బుధవారానికి డ్యామ్‌లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దాంతో సాయంత్రం డ్యామ్‌ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. 

నారాయణపూర్‌ దిగువన తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.68 టీఎంసీలు  ఉన్నాయి. వరద ఉధృతి వారం పాటు ఇదే రీతిలో కొనసాగే అవకాశం ఉండటంతో.. ఐదారు రోజుల్లో శ్రీశైలానికి ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 32,262 క్యూసెక్కులు తరలిస్తుండటంతో నీటి నిల్వ 35.63 టీఎంసీలకు తగ్గింది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)