నాలుగు పథకాలకు రూ.60 వేల కోట్లు

Published on Wed, 07/03/2024 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: రానున్న 3 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఇది ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని, ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చి భూసార పరీక్షలు ప్రారంభించిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రైతుబీమాలో 1,222 క్లెయిమ్స్‌ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 

ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్‌ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా? లేదా? అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలని, ఇది అన్నింటికీ ప్రాతిపదిక అన్నారు. ఆయిల్‌ పామ్‌ ప్రాజెక్ట్‌ చేపట్టి మూడేళ్లయినా ఇంకా రెండు శాఖల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తంచేశారు. 2023–24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి ఉందన్నారు. 

హెచ్‌ఈవోలు లేనిచోట ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రైతును ఎంపిక చేయడం నుంచి డ్రిప్‌ ఇన్‌స్టాల్‌ చేయించడం, మొక్కలు నాటించడం వరకు అన్నింటిపై ఏఈవో, ఏవో బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు సబ్సిడీపై ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్, డైరెక్టర్‌ గోపి, ఉద్యాన డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)