Breaking News

అరుణవ్‌ చిరునవ్వులు.. ఇక కానరావు

Published on Sun, 02/23/2025 - 07:45

నాంపల్లి: చిరునవ్వుల అరుణవ్‌ ఊపిరాగింది. ఇరు కుటుంబాల ఆశల కిరణం ఆరిపోయింది. లిఫ్టులో ఇరుక్కుని చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు అరుణవ్‌ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. అరుణవ్‌ను బతికించడానికి నిలోఫర్‌ వైద్యులు శత విధాలా ప్రయతి్నంచినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.రవికుమార్‌ ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి బంధువులకు అప్పగించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే కన్నుమూయడంతో  అజయ్‌కుమార్‌ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.  

అత్తను చూసేందుకు వచ్చి..   
గోడేఖీ ఖబర్‌ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్‌ దంపతులకు ఒకే ఒక సంతానం. మగ పిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అజయ్‌కుమార్‌ సోదరి, అరుణవ్‌ మేనత్త జయశ్రీ అలియాస్‌ ఆయేషా  శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో చాలా రోజులు అజయ్‌కుమార్‌ కుటుంబం జయశ్రీ అలియాస్‌ ఆయేషాతో దూరంగా ఉంటోంది. 

ఆయేషాకు ఇటీవల తన పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు, వచి్చపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలుడు అరుణవ్‌ శుక్రవారం తన తాతయ్యతో కలిసి శాంతినగర్‌లోని మేనత్త ఇంటికి వచ్చి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. రెండు కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో బాలుడి మరణం విషాదాన్ని నింపింది.    

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)