Breaking News

Telangana: ఇక రైతుల వద్దకే నేరుగా విత్తనాలు

Published on Sat, 11/30/2024 - 04:59

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు అవసరమైన విత్తనాలను నేరుగా సరఫరా చేసేందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ (టీజీఎస్‌డీసీ) సిద్ధమైంది. ప్రైవేట్‌ కంపెనీలు, దళారుల మాయమాటలకు రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రస్తుత యాసంగి సీజన్‌ నుంచే కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్, ఆదర్శ రైతు సేవాకేంద్రాలు(ఏఆర్‌ఎస్‌కేస్‌), డీసీఎంలతోపాటు హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న టీజీఎస్‌డీసీ విక్రయ కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్‌ నుంచి గ్రామాల్లోని రైతులు 2 టన్నులకు మించి విత్తనాలు ఆర్డర్‌ చేస్తే నేరుగా వారి వద్దకే సరఫరా చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్‌ నాటికి కనీసం 15 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి అవసరమయ్యే 7 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందించాలని విత్తనాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది.  

ఈ యాసంగి సీజన్‌లో  ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి 40 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని టీజీఎస్‌డీసీ భావిస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల విత్తనాలను రాష్ట్రంలోని అన్ని మండలాలకు పంపించింది.  

⇒ ఇందులో సన్నరకం విత్తనాలైన తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌– 15048), కేఎన్‌ఎం 1638, జేజీఎల్‌ 27356 అందుబాటులో ఉంచారు.  
⇒ ఇక దొడ్డు రకాలైన ఎంటీయూ–1010, జేజీఎల్‌– 24423, కేఎన్‌ఎం–118, ఆర్‌ఎన్‌ఆర్‌–29,325 రకాలను అందుబాటులో ఉంచింది. రైతు వద్దకే విత్తనాలు, సంస్థ కౌంటర్లలో 6 శాతం డిస్కౌంట్‌ ఈ సీజన్‌ నుంచే ప్రారంభిస్తున్నట్టు చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి చెప్పారు. వరి విత్తనాలతోపాటు శనగ, వేరుశనగ, పెసర మొదలైన విత్తనాలను కూడా సంస్థ అందుబాటులో ఉంచింది.  

రైతుల అవగాహన కోసం సమావేశాలు  
విత్తనాల పట్ల రైతుల్లో ఉన్న సందేహాల ను తొలగించడం, ప్రైవేట్‌ కంపెనీల దందాకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా విత్తనా భివృద్ధి సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా చైర్మన్‌ అన్వే‹Ùరెడ్డి సహకార సంఘాల చైర్‌పర్సన్లు, సీఈఓలతో ఆదిలాబాద్, జగిత్యా ల, మెదక్‌ జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. మిగతా జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్యపరచాలని నిర్ణయించారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)