Breaking News

కోరుట్లలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి హత్య

Published on Sun, 07/06/2025 - 09:18

జగిత్యాల జిల్లా: కళ్ల ఎదుట ఆడుకుంటున్న ఉన్న..అమ్మాయి అకస్మాతుగా కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లో విగతజీవిగా కనిపించింది. బాత్‌రూంలో బాలిక హర్షిత మెడ కోసి దారుణంగా చంపిన వైనం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. కోరుట్లలోని ఆదర్శనగర్‌లో నివాసముండే ఆకుల రాము–నవీన దంపతుల కూతురు హర్షిత(6) హత్య స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. 

పెద్దపులులు చూసి వచ్చి...
శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్‌రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్‌రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

హత్యా..ప్రమాదమా?
బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్‌గా పోలీసులు గుర్తించారు. విజయ్‌ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్‌తో పాటు అతని అన్న, తమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్‌ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్‌ఫోన్‌ ద్వారా అతనితో మాట్లాడితే  వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం. విజయ్‌ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్‌రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్‌రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బాలిక మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎస్పీ అశోక్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు.

 

#

Tags : 1

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)