Breaking News

ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే!

Published on Tue, 03/11/2025 - 05:50

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఐదు స్థానాలకు గాను ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. సభలో ఉన్న బలాబలాలను బట్టి మూడు అధికార కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్‌ఎస్‌కు దక్కడం ఖాయం కాగా, మిగిలిన ఐదో స్థానంలో గెలిచేందుకు ఈ అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో ఒకవేళ బీఆర్‌ఎస్‌ రెండో అభ్యరి్థని నిలబెడితే ఎన్నిక నిర్వహించాల్సి వచ్చేది. కానీ ఆ పార్టీ నుంచి కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఉపసంహరణల ప్రక్రియ ముగిసేసరికి ఉన్న నామినేషన్లను పరిగణనలోకి తీసుకుంటారు.

ఉపసంహరణల సమయం ముగియగానే ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే మిగిలితే అందరు అభ్యర్థులు ఏక్రగీవం­గా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా ప్రకటిస్తారు. మొత్తం మీ­ద పోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలావుండగా..మరో ప్రధాన పార్టీ ఎంఐఎం కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)