Breaking News

60% పెద్దల్లో యాంటీబాడీలు

Published on Sat, 07/24/2021 - 00:51

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దాదాపు 60.1 శాతం పెద్దల్లో కరోనా వైరస్‌కు విరుగుడుగా యాంటీబాడీలు తయారైన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ప్రకటించింది. పిల్లల్లో ఇది 55 శాతంగా నమోదైనట్లు తెలిపింది. కౌమార వయస్కుల విషయానికి వస్తే 61 శాతం మంది, ఆరోగ్య కార్యకర్తల్లో 82.4 శాతం మందిలోనూ యాంటీబాడీలు ఉన్నాయని వివరించింది. అయితే వారిలో చాలా మంది టీకాలు వేయించుకుని ఉండ టం కూడా ఎక్కువ శాతం మందిలో యాం టీబాడీల ఉండేందుకు కారణమై ఉండొచ్చని అభి ప్రాయపడింది. ఈ మేరకు నాలుగో విడత సెరో సర్వే వివరాలను ప్రకటించింది.

క్రమంగా పెరుగుదల...
కరోనా వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో భాగంగా ఐసీఎంఆర్‌ ఒకే ప్రాంతంలో పలు దఫా లుగా సెరో సర్వే నిర్వహించింది. తొలి సర్వే గతే డాది మేలో జరగ్గా రెండు, మూడు సర్వేలు ఆగస్టు, డిసెం బర్‌లలో చేపట్టింది. తాజాగా ఈ ఏడాది జూన్‌లో నాలుగో సర్వే జరిగింది. తొలి మూడు సర్వేల్లో  పాజిటివిటి వరుసగా 0.33 శాతం, 12.5 శాతం, 24.1 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో సెరో పాజిటివిటీ గతేడాది డిసెంబర్‌ నాటికి 24 శాతం ఉంటే ఈ ఏడాది జూన్‌కు అది 67 శాతానికి ఎగబాకింది. ఇదే కాలానికి తెలంగాణలో కొంచెం తక్కువగా (24 శాతం నుంచి 60.1 శాతం) ఉం డటం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణలో టీకాలు వేయించుకోని వారిలోనూ సెరో పాజిటివిటీ 51.3 శాతంగా ఉండటం. ఒక డోసు తీసుకున్న వారిలో ఇది 78.5 శాతం ఉండగా రెండో డోసూ పూర్తి చేసుకున్న వారిలో 94 శాతంగా ఉంది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)