Breaking News

Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..

Published on Wed, 05/15/2024 - 07:24

సాక్షి, హైదరాబాద్: పోలింగ్‌ విషయంలో గ్రేటర్‌ జిల్లాల్లో మార్పు రావడం లేదు. గతంలో మాదిరిగానే హైదరాబాద్‌ జిల్లాకు అత్యల్ప పోలింగ్‌ నమోదై చివరి స్థానం దక్కింది. గత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే దాదాపు మూడు శాతం పెరిగినా..రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్‌ మాత్రం ఇక్కడే నమోదైంది. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 48.48 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంమీద 22,17,094 ఓట్లకు గాను 10,74,827 ఓట్లు పోలయ్యాయి. గోషామహల్‌ సెగ్మెంట్‌లో 54.72 శాతం, కార్వాన్‌లో 51.23, బహదూర్‌పురాలో 50.07, చాంద్రాయణగుట్టలో 49.15, చారి్మనార్‌ 48.53, యాకుత్‌పురాలో 43.34, మలక్‌పేటలో 42.76 శాతం పోలయ్యాయి. 

సికింద్రాబాద్‌లో 49.04%
సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో 49.04 శాతం పోలింగ్‌ నమోదైంది. గత లోకసభ ఎన్నికలతో పోలిస్తే ఒక శాతం పోలింగ్‌ పెరిగినా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల కంటే ఒక శాతం తగ్గినట్లయింది. సెగ్మెంట్ల వారిగా పరిశీలిస్తే ముషీరాబాద్‌లో 49.09 శాతం, అంబర్‌పేటలో 51.65, ఖైరతాబాద్‌లో 50.28, జూబ్లీహిల్స్‌లో 45.59, సనత్‌నగర్‌లో 49.45, నాంపల్లిలో 46.59, సికింద్రాబాద్‌లో 52.28 శాతం పోలింగ్‌ నమోదైంది. 

చేవెళ్లలో 56.50%  
చేవెళ్ల లోక్‌ సభ పరిధిలో 56.50 శాతం పోలింగ్‌ నమోదైంది. గత పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చితే 0.31 పెరిగినా..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే పది శాతం తగ్గింది. మొత్తం మీద 29,38,870 ఓటర్లకు గాను 16,57,107 మంది ఓటేశారు. సెగ్మెంట్ల వారిగా చేవెళ్లలో 71.83 శాతం, వికారాబాద్‌లో 70.44 శాతం, తాండూర్‌లో 67.33 శాతం. పరిగిలో 67.01 శాతం, రాజేంద్రనగర్‌లో 54.12 శాతం,  మహేశ్వరంలో 52.71 శాతం,  శేరిలింగంపల్లిలో  54.12 శాతం పోలింగ్‌ నమోదైంది. 

మల్కాజిగిరిలో 50.78% 
మల్కాజిగిరి పరిధిలో పోలింగ్‌ 50.78 శాతం నమోదైంది. అసెంబ్లీ వారిగా పోలింగ్‌ శాతం పరిశీలిస్తే మేడ్చల్‌లో 57.83 శాతం, మల్కాజిగిరిలో 51.97, కుత్బుల్లాపూర్‌లో 50.19, కూకట్‌పల్లిలో 48.48, ఉప్పల్‌లో 48.45, ఎల్బీనగర్‌లో 46.27, కంటోన్మెంట్‌–సికింద్రాబాద్‌లో 51.61 శాతం పోలింగ్‌ నమోదైంది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)