Breaking News

ఒకే ఇంట్లో 42 ఓట్లు

Published on Tue, 10/14/2025 - 08:38

హైదరాబాద్‌: యూసుఫ్‌గూడ డివిజన్‌ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ఎన్నికల అధికారులు కొట్టివేశారు. శ్రీకృష్ణానగర్‌లోని బి–బ్లాక్‌లో ఉన్న 8–3–231/బి/160 నెంబర్‌గల సంస్కృతి ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌ను సోమవారం ఎన్నికల అధికారులు సందర్శించారు. 

అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, ఖైరతాబాద్‌ తహశీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పలువురు బీఎల్‌ఓలు సోమవారం   విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆ ఇంట్లో రామకృష్ణ, ప్రసన్న, సుబ్బరత్నమ్మ అనే ముగ్గురు మాత్రమే ఓటర్లు ఉంటున్నారు. అయితే మిగిలిన 39 మంది మాత్రం అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లారు. సిని పరిశ్రమకు చెందిన వారుగా గుర్తించిన అధికారులు అసోసియేషన్‌ కార్యాలయానికి వెళ్లి వారి వివరాలు ఆరా తీశారు.  ఈ క్రమంలో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టŠస్‌లో వారు విధులు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా గుర్తించారు. 

ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇంటి నెంబర్‌తో మరో ఓటును కూడా పొందారా అనే క్రమంలో విచారించగా ఇంకో ఓటు లేదని నిర్థరణకు వచ్చారు. తమ ఓటు అదే ఇంటి నెంబర్‌లో ఉంటుందని, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశామని అధికారులకు తెలియజేశారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఓట్లు వేస్తున్నట్లుగా తెలిపారను. కాగా ఇల్లు ఖాళీ చేసిన వారి ఓట్లను వారి అనుమతి లేకుండా తొలగించే హక్కు బీఎల్‌ఓలకు లేని కారణంగా వాటిని తొలగించలేదని, 43 ఓటర్లను గుర్తించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)