Telangana: ఒకే రోజు సెలవులో 40 వేల మంది టీచర్లు

Published on Sun, 12/28/2025 - 10:14

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు భారీగా సెలవులు పెట్టారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 వేలకు పైగా టీచర్లు క్యాజువల్‌ లీవ్‌ (సీఎల్‌) తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం శనివారం 40,005 మంది సీఎల్‌ పెట్టారు. రాష్ట్రంలో 1.12 లక్షల టీచర్లున్నారు. 

వీరిలో 40 వేల మంది సెలవుపెట్టారంటే 33 శాతం మంది సెలవులో ఉన్నట్లు లెక్క. దీంతో చాలా మటుకు బడుల్లో పాఠాలు అటకెక్కాయి. జగిత్యాల జిల్లాలోని ఓ స్కూళ్లో ఆరుగురు టీచర్లకుగాను నలుగురు టీచర్లు సెలవు పెట్టగా, ఇద్దరు టీచర్లు మాత్రమే విధులకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఓ స్కూళ్లో 17 మందికి ఏడుగురు టీచర్లు విధులకు హాజరుకాలేదు. ఇదే పరిస్థితి చాలా బడుల్లో నెలకొన్నది. క్రిస్మస్, బాక్సింగ్‌డే సందర్భంగా గురు, శుక్రవారాల్లో సెలవులొచ్చాయి.

 శనివారం మాత్రమే పనిదినం కాగా, ఆదివారం సెలవు కావడంతో చాలా మంది టీచర్లు సెలవుపెట్టారు. ఇక సంవత్సరం ముగింపునకు చేరుకోవడం, సీఎల్‌లు ఉండటంతో వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో మరికొందరు టీచర్లు సెలవుల్లో వెళ్లారు. ఇక మరికొందరు స్కూల్‌ కాంప్లెక్స్‌ మీటింగ్స్‌ ఉండటంతో విధులకు గైర్హాజరైనట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)