Breaking News

తెలంగాణలో రైల్వే అభివృద్ధి వేగవంతం

Published on Sat, 11/29/2025 - 01:48

కేపీహెచ్‌బీకాలనీ: నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయిన తర్వా త తెలంగాణలో రైల్వే అభివృద్ధి వేగవంత మైందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రైల్వేలైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునికీకరణ సహా రాష్ట్రంలో ఏక కాలంలో 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ జరుగుతోందన్నారు. హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో ప్రతిరోజూ 62 సబర్బన్‌ ట్రైన్లు, ఎంఎంటీఎస్‌ ట్రైన్లు ఆగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, బోరబండ, ఫలక్‌నుమా వంటి స్టేషన్లకు ఈ స్టేషన్‌ నుంచి కనెక్టివిటీ ఉందన్నారు.

ఇప్పుడు మరింత కనెక్టివిటీ, మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజూ ఈ స్టేషన్‌ ద్వారా సుమారు 5,400 మంది ప్రయాణికులు సేవలు వినియోగించుకుంటున్నారన్నారు. 16 స్పెషల్‌ ట్రైన్లు సంక్రాంతి పండుగ సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇక్కడ ఆగబోతున్నాయని చెప్పారు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ నిర్మాణం దాదాపుగా పూర్తయ్యిందన్నారు.

హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా త్వరలో ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. ఎంఎంటీఎస్‌ సెకండ్‌ ఫేజ్‌ను యాదాద్రి వరకు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాజీపేటపరిధిలో నిర్మి స్తున్న రైల్వే మల్టీ మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌  నిర్మాణ పనులను శని వారం పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ పాల్గొన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)