Breaking News

పెళ్లయినా పిల్లలు పుట్టరని..

Published on Sun, 01/12/2025 - 11:01

మహబూబ్‌నగర్‌ క్రైం: పెళ్లయినా పిల్లలు పుట్టరని తెలుసుకొని.. ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఉండాలని భావించిన ఓ వ్యక్తి.. సమీప బంధువు కుమారుడిని కిడ్నాప్‌ చేశా డు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించారు. జడ్చర్ల మండల పరిధిలోని కొత్తతండాకు చెందిన పాత్లవత్‌ లాలు కొన్ని రోజులుగా జిల్లాకేంద్రంలోని పద్మా వతి కాలనీలో  ఉంటూ మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 

అయితే లాలు వద్ద సమీప బంధువు ఖిల్లాఘనపురం మండలం తిర్మాలయి పల్లికి చెందిన సభావత్‌ రాజు రెండు నెలలగా మేస్త్రీ పని చేస్తున్నాడు. అయితే సభావత్‌ రాజుకు లైంగిక సమస్యలు ఉండటంవల్ల పెళ్లి కాదని, ఒకవేళ పెళ్లి అయినా పిల్లలు పుట్టరని తెలుసుకున్నాడు. దీంతో ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని భావించి పథకం ప్రకారం.. లాలు కొడుకు మూడేళ్ల విక్కీని చాక్లెట్లు, ఇతర తినుబండారాలు ఇప్పిస్తూ దగ్గర చేసుకున్నాడు. 

ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పద్మావతి కాలనీ అంగన్‌వాడీ సెంటర్‌ దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న విక్కీని స్కూటీపై ఎక్కించుకుని జడ్చర్లకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత రాజుకు పరిచయం ఉన్న సావిత్రిని కలిసి, జరిగిన విషయం చెప్పకుండా ఆమెను కూడా తీసుకుని విజయవాడ వెళ్లాడు. రాజు వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా పోలీసులు నిందితుడు విజయ వాడలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక టీం రాజును అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)