వణికించిన పిడుగులు!

Published on Mon, 09/23/2024 - 04:42

నాగర్‌కర్నూల్‌ (బిజినేపల్లి)/వనపర్తి రూరల్‌/ న్యాల్‌కల్‌ (జహీరాబాద్‌): రాష్ట్రంలో పిడుగుల ధాటికి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు నక్క నీలమ్మ (40) తన అక్క నాగేంద్రమ్మతో కలిసి గేదెలను మేత కోసం తీసుకెళ్లారు. మధ్యాహ్నం వర్షం పడుతుండటంతో నీలమ్మ చెట్టు కిందికి వెళ్లగా..  పిడుగుపడింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. నీలమ్మ అక్క నాగేంద్రమ్మ పిడుగుపాటుకు స్పృహ కోల్పోయింది.

మరో ఘటనలో వనపర్తి మండలం చిమనగుంటపల్లికి చెందిన పద్మమ్మ (40) ఆదివారం ఉదయం గొర్లను మేతకు తీసుకొని నల్లగుట్టకు వెళ్లింది. సాయంత్రం పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం న్యామతాబాద్‌ గ్రామానికి చెందిన ఏసప్ప భార్య బూచినెల్లి నాగమ్మ (42) శనివారం పొలానికి వెళ్లింది. సాయంత్రం గాలి వాన రావడంతో ఇంటికి బయలుదేరగా, గ్రామ సమీపంలో పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. దీంతో నాగమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు బీదర్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)