Breaking News

ముక్కిపోతున్న దొడ్డు బియ్యం

Published on Mon, 05/26/2025 - 00:55

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నెల నుంచి తెల్లరేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి నెలలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం ఇంకా రేషన్‌ షాప్‌లలోనే ఉంది. మూడు నెలలుగా స్టాక్‌ ఉండటంతో ముక్కిపోతున్నాయి. పైగా లక్క పురుగులు వచ్చి చేరుతున్నాయి. దీంతో దొడ్డు బియ్యానికి పట్టిన లక్క పురుగులు సన్న బియ్యానికి పడతాయని రేషన్‌ డీలర్లు అంటున్నారు.  

మార్చి నెలలో కార్డుదారులకు ఇవ్వగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో 28,380.97 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం మిగిలింది. వాటిని రేషన్‌షాప్‌లలో పక్కన పెట్టాలని పౌరసరఫరాల శాఖ గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గదులు ఇరుకుగా ఉండటంతో సన్న బియ్యం దించుకునేందుకు స్థలం ఉండటం లేదు. ఈ బియ్యమంతా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీవరకు రేషన్‌షాప్‌లకు చేరింది. మూడు నెలలుగా నిల్వలు ఉండటంతో లక్క పురుగు పడుతున్నాయి. పలుచోట్ల వర్షాలకు తడిసి ముక్కిపోతున్నాయి.  

ఎఫ్‌సీఐకి పెడితే ఆదాయం 
సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో దొడ్డు బియ్యంతో పని ఉండదు. ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐ లేదా ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పైగా రేషన్‌షాప్‌లలో ఉన్న సన్న బియ్యానికి లక్క పురుగుల బాధ ఉండదు.  

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే షిఫ్ట్‌ చేస్తాం 
రేషన్‌ షాప్‌లలో స్టాక్‌ ఉన్న దొడ్డు బియ్యం గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆ బియ్యం బస్తాలకు రెడ్‌ కలర్‌తో ఇంటు మార్క్‌ వేయించాం. ఈ బియ్యాన్ని శుభ్రంగా ఉంచాలని, సేఫ్టీగా భద్రపరచాలని డీలర్లకు చెప్పాం. బియ్యం తరలింపుపై ఆదేశాలు రాగానే రేషన్‌షాపుల నుంచి తరలిస్తాం.       – అబ్దుల్‌ హమీద్, అదనపు కలెక్టర్, సిద్దిపేట

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)