Breaking News

నెల ముందే గరిష్టానికి..!

Published on Sun, 05/05/2024 - 03:30

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. సాధారణంగా మే నెల చివరివారంలో ఉండే స్థాయిలోని గరిష్ట ఉష్ణోగ్రతలు.. మే తొలివారంలోనే నమోదవుతుండటం గమనార్హం. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లిపూర్, కరీంనగర్‌ జిల్లా వీణవంకలలో గరిష్ట ఉష్ణోగ్రత 46.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.

దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో చూస్తే.. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 4.5 డిగ్రీలు, హైదరాబాద్, ఖమ్మంలలో 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే అధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

వడగాడ్పుల తీవ్రత పెరిగే చాన్స్‌ 
శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయని.. ఆది, సోమవారాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. 

ఉరుములు, మెరుపుల వానలకు చాన్స్‌ 
మరాఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా వానలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వివరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)