జగిత్యాల: బస్సును ఢీకొన్న లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం

Published on Fri, 04/21/2023 - 19:37

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈ ప్రమాద ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. ఎండ‌ప‌ల్లి మండ‌లంలోని కొత్త‌పేట వ‌ద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాద ఘటన చోటుచేసుకుంది. అయితే, సిద్దిపేట జిల్లాలోని బెజ్‌గాం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇటీవ‌లే ఓ వృద్ధురాలు చ‌నిపోయింది. ఈ నేపథ్యంలో, ఆమె అస్తిక‌ల‌ను ధ‌ర్మ‌పురి వ‌ద్ద గోదావ‌రి నదిలో క‌లిపేందుకు ఆమె కుటుంబ స‌భ్యులు దాదాపు 25 మంది శుక్రవారం ఓ ప్రైవేటు బస్సులో బ‌య‌ల్దేరారు. 

ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సును కొత్త‌పేట వ‌ద్ద‌ ఎదురుగా వ‌స్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బ‌స్సులో ఉన్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో​ బస్సును లారీ ఎదురుగా ఢీకొనడంతో డ్రైవ‌ర్ బ‌స్సులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం.. జేసీబీ స‌హాయంతో డ్రైవర్‌ను బ‌య‌ట‌కు తీసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇక, ప్రమాదంలో త్రీవంగా గాయపడి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న ఐదుగురిని క‌రీంన‌గ‌ర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించగా, మిగ‌తా వారిని జ‌గిత్యాల ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)