Breaking News

సీఎం ప్రజావాణిలో 247 దరఖాస్తులు

Published on Fri, 07/10/2026 - 22:30

హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన 237వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 247 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 120, రెవెన్యూ శాఖకు సంబంధించి 45, హోం శాఖకు 17 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 65 దరఖాస్తులు అందాయి. 

ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులను స్వీకరించి ఎండార్స్ మెంట్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.

సీఎం ప్రజావాణిని సందర్శించిన క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ సందర్శించారు. సీఎం ప్రజావాణి, ప్రవాసి సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. కాగా డిగ్రీ కాలేజీ గెస్ట్ లెక్చరర్స్ తమకు ఫిక్స్డ్ గౌరవ వేతనం ఇప్పించాలని, ఎడాదికి పది నెలలు పని దినాలు కల్పించాలని కోరారు. స్పోర్ట్స్ కోటా కింద స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం చిన్నారెడ్డి, విద్యా సాగర్ కృషి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై సమన్వయ వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి,  సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, ప్రతినిధి పద్మారాణి కర్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)