Breaking News

23ఏళ్ల భూవివాదానికి తెర

Published on Sat, 05/10/2025 - 12:34

ఖలీల్‌వాడి(నిజామాబాద్): దీర్ఘకాలిక భూ వివాదాన్ని నిజామాబాద్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ జడ్జి కుమారం గోపీకృష్ణ పరిష్కరించారు. 30 గుంటల భూమి కోసం 23న్నర ఏళ్లుగా ఇరువర్గాలు న్యాయపోరాటం చేయగా జడ్జి రాజీకుదిర్చి లోక్‌ అదాలత్‌ అవార్డు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట్‌ మండలం దర్యాపూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌ రెడ్డి అనే వ్యక్తి బిల్లి చిన్న గంగారాం వద్ద 30 గుంటల భూమిని 2002 మార్చి 7న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. 

కాగా, ఆ భూమి తమ పూరీ్వకులదని, అమ్మే హక్కు తమ తండ్రికి లేదని చిన్న గంగారాం కుమారులు పెద్ద గంగాధర్, గంగరాం, సత్యనారాయణ, గాం«దీలు సంతోష్‌ రెడ్డితో గొడవపడుతూ ఇబ్బందులకు గురి చేసేవారు. దీంతో సంతోష్ రెడ్డి నిజామాబాద్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో 2002 సెపె్టంబర్‌ 2న సివిల్‌ దావా వేయగా, 2004 ఆగస్టు 18న అనుకూలంగా తీర్పు వచ్చింది.  దీంతో ఆ భూమిని సంతోష్‌రెడ్డి ఇతరులకు విక్రయించాడు. అదే సమయంలో జూనియర్‌ సివిల్‌ కోర్టు తీర్పును గంగారాం కుటుంబం జిల్లా కోర్టులో అప్పీలు చేసింది. అక్కడ కూడా వారు ఓడిపోయారు. అనంతరం మళ్లీ గొడవలు జరగగా, సంతోష్‌ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

 పిటిషన్‌ పరిశీలించిన కోర్టు గంగారాం కొడుకులకు నెల రోజుల సివిల్‌ జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర హైకోర్టులో సవాల్‌ చేసి స్టే తెచ్చుకున్నారు. కేసు పూర్వాపరాలు అధ్యయనం చేసిన జడ్జి గోపీకృష్ణ, సంతోష్‌ రెడ్డి తరఫు న్యాయవాది జక్కుల వెంకటేశ్వర్, బిల్లి గంగరాం కుటుంబసభ్యుల తరఫు న్యాయవాది శ్రీహరి ఆచార్యతో సంప్రదింపులు జరిపి రాజీవైపు నడిపించారు. భూమిని ఇరువర్గాలకు సమభాగంగా పంచి వివాదానికి అంతిమ పరిష్కారం చూపారు. కక్షిదారుల తరఫున న్యాయవాదులతో లోక్‌ అదాలత్‌ బెంచ్‌లో ఒక ఉమ్మడి రాజీ పరిష్కార పిటిషన్‌ దాఖలు చేయడంతో అవార్డును జారీ చేశారు. 

Videos

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

బాబూ... అప్పుడే ఎందుకు భయపడుతున్నావ్..? అతి దగ్గరలోనే!

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)