Breaking News

22 రూపాయల కోసం హత్య

Published on Sun, 01/18/2026 - 07:23

చేగుంట(మెదక్ జిల్లా): కేవలం 22 రూపాయల పాత బాకీ విషయంలో గొడవపడి, తోటి కార్మికుడిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. 

మెదక్‌ జిల్లా అనంతసాగర్‌ శివారులోని సప్తగిరి కెమికల్‌ పరిశ్రమలో పనిచేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిరాజ్‌ (30), అదే రాష్ట్రానికి చెందిన మహేశ్‌కుమార్‌ధర్మ ఒకే గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న పండుగ రోజు మద్యం సేవించేందుకు ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్లారు. గ్రామశివారులో మద్యం తాగుతూ సిరాజ్‌ తనకు బాకీ ఉన్న రూ.22 విషయంలో మహేశ్‌కుమార్‌ గొడవ పెట్టుకున్నాడు. 

మాటామాటా పెరగడంతో మహేశ్, సిరాజ్‌ తలను చెట్టుకు బాది, అనంతరం రాయితో తలపై గాయపరిచాడు. దీంతో సిరాజ్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మహేశ్‌కుమార్‌ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న తూప్రాన్‌ సీఐ రంగాకృష్ణ, చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మాసాయిపేట శివారులో నిందితుడు మహేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు దారితీసిన వివరాలు తెలిపాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.  

Videos

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు