Breaking News

ఆర్టీఏ 2 శాతం దోపిడీ

Published on Mon, 06/17/2024 - 03:23

సాక్షి, హైదరాబాద్‌: ఒక వ్యక్తి అప్పటికే ఓ కారును కలిగి ఉండి మరో కారును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే 2 శాతం పన్ను రవాణాశాఖకు అదనంగా చెల్లించాలి. అంటే కొత్త వాహనంపై విధించే 18 శాతం పన్నుతో పాటు మొదటి కారుపై 2 శాతం వసూలు చేయాలనేది నిబంధన. కానీ ఆర్టీఏ అధికారులు ద్విచక్రవాహనం ఉన్నప్పటికీ రెండు శాతం పన్ను విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కేవలం కార్లకే ఆ నిబంధన కానీ..  
సాధారణంగా ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబ అవసరాలకు ఒక కారు సరిపోతుందనే భావనతో ఈ అదనపు పన్ను నిబంధనను అప్పట్లో తెరపైకి తెచ్చారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కార్లను కలిగి ఉండడం వల్ల రహదారులపై భారం పెరుగుతుందని, అదనపు వాహనాలపై పన్నులు విధిస్తే ఆ కొనుగోళ్లను ఒకింత తగ్గించాలని భావించి గతంలో రవాణాశాఖ అధికారులు ఆ నిబంధనను అమలు చేస్తూ వచ్చారు. 

కానీ.. దీన్ని కేవలం కార్లకు మాత్రమే పరిమితం చేయాల్సి ఉండగా.. ద్విచక్ర వాహనాలను కూడా ఈ నిబంధన పరిధిలోకి తేవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ద్విచక్ర వాహనం కలిగిన వ్యక్తి కొత్తగా కారును కొనుగోలు చేస్తే ఆ కారు ధరలో 18 శాతం జీవితకాల పన్నుతో పాటు మరో 2 శాతం అదనంగా చెల్లించాలని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ద్విచక్ర వాహనంఉన్నవారు కారు కొనుగోలు చేస్తే రూ.వేలల్లో అదనపు పన్ను చెల్లించాల్సివస్తోంది. ఈ అడ్డగోలు నిబంధన వల్ల 2010 నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది నష్టపోయారు. పైగా.. కాలం చెల్లి, తుప్పు పట్టి, వినియోగానికి పనికి రాని వాహనాలపై, చోరీకి గురైన వాహనాలపైనా రవాణాశాఖ నిర్దాక్షిణ్యంగా అదనపు పన్ను వసూళ్లకు పాల్పడడం గమనార్హం.  

కారు.. బైక్‌ ఒకటేనా? 
నలుగురు ప్రయాణం చేసే కారును.. ఇద్దరు మాత్రమే వెళ్లగలిగే బైక్‌ను ఒకే రకమైన వాహనంగా ముద్రవేసి పన్ను విధించడం వివాదాస్పదమవుతోంది. ‘2010లో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను విధించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇది కార్లకే పరిమితం చేయాలని నిర్ణయించాం. కానీ నిబంధనల్లో ఈ విషయం స్పష్టంగా లేకపోవడం వల్ల ద్విక్ర వాహనాలకు కూడా అమలవుతోంది’అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పుకొచ్చారు. 

ఏపీలో ఎత్తేసినా.. ఇక్కడ మాత్రం 
ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి తెచి్చన రెండు శాతం అదనపు పన్ను నిబంధనను గత ఏపీ ప్రభుత్వం తొలగించింది. ‘రెండో వాహనం’తో నిమిత్తం లేకుండా కొత్త వాహనాలపై 18 శాతం జీవితకాల పన్ను వసూలు చేస్తోంది. 2021లోనే ఈ రెండో వాహనం నిబంధనను తొలగించడంతో లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చినట్లయింది. 

మరోవైపు వాహనం శాశ్వత రిజి్రస్టేషన్‌ కోసం వాహన యజమానులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా షోరూమ్‌ల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌ సదుపాయం కల్పించారు. అంటే కొత్తగా బైక్, కారు తదితర వాహనాలను కొనుగోలు చేసిన వారు వాటి నమోదు కోసం ప్రత్యేకంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నంబర్‌ ప్లేట్‌తో సహా షోరూమ్‌లోనే అన్ని పనులు పూర్తవుతాయి.

‘బాదుడు’కథనంపై చర్చ..  
‘బండి ఉన్నా లేకున్నా బాదుడే’అనే శీర్షికన రెండు రోజుల క్రితం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన కథనం రవాణా శాఖలో చర్చకు తెరలేపింది. వినియోగంలో లేని వాహనాలను సైతం రెండో బండిగా పరిగణించి వాహనదారులపై అదనపు భారం మోపడంపై ఈ కథనంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

ఒక వాహనదారు తన బండి చోరీకి గురైందని పేర్కొంటూ పోలీసుల ధ్రువీకరణతో సహా ఆర్టీఏకు సమర్పించినప్పటికీ దాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలు నిబంధనలతో అదనపు వడ్డనకు పాల్పడుతున్న వైనాన్ని ఆ కథనంలో ప్రస్తావించడంతో చర్చ జరుగుతోంది.  రెండో వాహనం కొనుగోలు చేసినప్పుడు జీవితకాల పన్నుపై మినహాయింపునివ్వాలని, ఈ మేరకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు.  

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)