Breaking News

6 ఖండాలు 44 దేశాలు 154 మంది అతిథులు

Published on Sun, 12/07/2025 - 05:30

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌– 2025కు 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మొహమ్మద్‌ అజహరుద్దీన్‌తో కలిసి శనివారం ప్రజాభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సమ్మిట్‌ కార్యక్రమాల వివ రాలను వెల్లడించారు. ఈ నెల 8న మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.

సమ్మిట్‌లో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ప్రసంగిస్తారని.. తొలిరోజు నోబెల్‌ పురస్కార గ్రహీతలు అభిజిత్‌ బెనర్జీ, కైలాశ్‌ సత్యార్థి, డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రంప్‌–మీడియా అండ్‌ టెక్నాలజీస్‌ గ్రూప్‌ నుంచి ఎరిక్‌ స్వేడర్, మంత్రి శ్రీధర్‌బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలతోపాటు డిప్యూటీ సీఎంగా తాను ప్రసంగిస్తానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2:30 గంటలకు కీలకోపన్యా సం చేస్తారని వివరించారు. తొలిరోజు ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం 3–4 గంటల మధ్య పలు శాఖల ఆధ్వర్యంలో చర్చాగోష్టులు జరుగుతాయని భట్టి తెలి పారు.

సమ్మిట్‌ రెండో రోజున ఉదయం 9 గంటలకు చర్చా గోష్టులు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్య సాధనలో భాగంగా చేపట్ట నున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లతో రూపొందించిన తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌–2047ను అదే రోజున ఆవిష్క రిస్తామన్నారు. 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్య క్రమం జరుగుతుందన్నారు. ముగింపు కార్య క్రమంలో పాల్గొనే ప్రముఖుల వివరాలను తరువాత తెలియజేస్తామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తు న్నామన్నారు.

ముఖ్యులకు అవసరమైతే ప్రత్యేక విమానాలు..
ఈ సమ్మిట్‌ రాజకీయ కార్యక్రమం కాదని.. పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్వహిస్తున్న సదస్సు అని భట్టి విక్రమార్క తెలిపారు.  ఎవరి స్థాయిలో వారు సదస్సును విజయవంతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఆదివారంలోగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సమస్యకు వెసులుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్య మైన వారికి ఇబ్బంది తలెత్తితే ప్రత్యేక విమాన సదుపాయం కల్పిస్తామన్నారు. సదస్సులో చేసుకున్న ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడుల వివరాలను చివరి రోజు వెల్లడిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

గవర్నర్‌ను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం
రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం లోక్‌భవన్‌లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025కు ఆహ్వానించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)