Breaking News

అక్షరాల గుడి... 150 ఏళ్ల బడి

Published on Fri, 01/31/2025 - 06:13

సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్‌నగర్‌: అక్షర సుమమై వికసించింది.. ఎంతోమంది మేధావులకు అక్షరాలను నేర్పించింది. ఈ చారిత్రక సరస్వతీ నిలయం ప్రత్యేకతను చాటుతూ 150 వసంతాలను పూర్తి చేసుకుంది. అదే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్‌నగర్‌ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది స్వాతం్రత్యానికి పూర్వమే ఏర్పాటైంది. శుక్రవారం 150 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.  

అనేకమంది ప్రముఖుల అక్షరాభ్యాసం  
ఈ బడిలో అనేక మంది ప్రముఖులు అక్షరాభ్యాసం చేశారు. తర్వాత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో దేశవిదేశాల్లో స్థిర పడ్డారు. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, యూపీ మాజీ గవర్నర్‌ సత్యనారాయణరెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఓయూ మాజీ వీసీ మల్లారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుడు రంగారావు, పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా అనేక మంది ఇక్కడ అక్షరాలు దిద్దినవారే.  

గ్రామస్తుల్లో చైతన్యం రగిలించేందుకు.. 
నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తుర్రెబాజ్‌ఖాన్‌ అప్పట్లో వారి నుంచి తప్పించుకుని షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్దలో ఆశ్రయం పొందినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ విషయం నిజాంకు తెలిసి తుర్రెబాజ్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేసి, హైదరాబాద్‌కు తరలించి ఉరి తీసినట్లు ప్రచారం ఉంది. గ్రామస్తులను విద్యాపరంగా చైతన్యవంతులను చేయాలనే సంకల్పంతో నాటి నిజాం సర్కార్‌ 1873లో మొగిలిగిద్దలో పాఠశాలను ఏర్పాటు చేసింది. మొదట్లో ఉర్దూ మీడియంలో విద్యాబోధన చేయగా, 1948లో తెలుగు మాధ్యమంలో బోధనను ప్రారంభించారు. నిజానికి పాఠశాల ప్రారంభమై 152 ఏళ్లుపూర్తి కావొస్తున్నా.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు 150వ వార్షికోత్సవాన్ని (కోవిడ్‌ కారణంగా రెండేళ్లు ఉత్సవాలు వాయిదా వేశారు) జరుపుకొనేందుకు సంసిద్ధులయ్యారు. ఇక్కడ 500 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.  

నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
స్వాతం్రత్యానికి ముందే ఇక్కడ పోలీస్‌స్టేషన్‌తోపాటు గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ఠాణా కింద 140 గ్రామాలు ఉండేవి. ఈ పోలీస్‌స్టేషన్‌ను 1983లో కొందుర్గ్‌కు తరలించారు. ఈ చారిత్రక గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌ కూడా ఉంది. పాఠశాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మొగిలిగిద్దకు చేరుకోనున్నారు. పాఠశాలలో పలు మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)