Breaking News

దళారుల ద్వారా జిన్నింగ్‌ మిల్లులకే..

Published on Fri, 02/13/2026 - 04:12

సాక్షి, హైదరాబాద్‌: దళారుల పాత్రను నిరోధించి, మద్దతు ధరతో రైతుల నుంచే పత్తిని కొనుగోలు చేసేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) చేసిన కసరత్తు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కేంద్రం తెచ్చిన కపాస్‌ కిసాన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని, దాని ద్వారానే స్లాట్‌ బుక్‌ చేసుకొని పత్తి ని సీసీఐకి విక్రయించాలనే నిబంధనను ఏర్పాటు చేశారు. అలాగే రైతు పండించిన పత్తిని ఉమ్మడి జిల్లా పరిధిలోని జిన్నింగ్‌ మిల్లుల్లోనే విక్రయించేలా నిబంధనలు పెట్టారు. 

అయినా చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దళారులు, జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, మద్దతు ధరకు రైతుల ముసుగులో మళ్లీ సీసీఐకే విక్రయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పత్తి పండించిన రైతులకు.. విక్రయించిన రైతులకు మధ్యనున్న భారీ వ్యత్యాసమే దానికి నిదర్శనం. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో పత్తిని సాగు చేయగా, నాలుగు నెలలుగా పత్తి విక్రయాలు సాగాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా పత్తి విక్రయాలు పూర్తయ్యాయి. ఈనెల 20తో అధికారికంగా పత్తి కొనుగోళ్లను సీసీఐ నిలిపివేస్తోంది. అయితే సీసీఐ రికార్డుల ప్రకారం ఇప్పటివరకు కేవలం 8,46,820 మంది రైతులు 15.63 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని 336 సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. వీరు కాకుండా మరో 2 లక్షల మంది రైతులు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి ఉండవచ్చని మార్కెటింగ్‌ శాఖ చెబుతోంది. 

అంటే దాదాపు 10 లక్షల మంది రైతులు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పత్తిని సాగు చేసిన 25 లక్షల మంది రైతుల్లో మిగతా 15 లక్షల మంది రైతులు పంటను ఎక్కడ విక్రయించారనేదే ప్రశ్న.

రైతుల ముసుగులో విక్రయాలు
రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 25 లక్షల మంది రైతులు 45.32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తిని సాగు చేసినట్లు వ్యవసా యశాఖ చెబుతోంది. 28.29 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి వస్తుందని అంచనా వేసింది. అయితే వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఆదిలా బాద్, మహబూబాబాద్‌ వంటి జిల్లాల్లో వర్షాలకు, గాలిలో తేమకు పత్తి నాని రంగు మారింది. ఈ నేపథ్యంలో సీసీఐ 8% నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని, మద్దతు ధర క్వింటాలుకు రూ. 8,111 ఇస్తామని, తగ్గిన ఒక్కో శాతానికి మద్దతు ధరలో ఒక శాతం చొప్పున తగ్గిస్తూ సీసీఐ ఆంక్షలు విధించింది. 

ఈ పరిస్థితుల్లో రంగు మారిన, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతుల నుంచి పత్తిని దళారులు సేకరించినప్పుడే రైతుల ఫోన్‌ నంబర్లు తీసుకొని ఓటీపీ ఆప్షన్‌ ద్వారా కౌలు రైతుల పేరిట పత్తిని సీసీఐకి విక్రయించినట్లు సమాచారం. ఈ దందాలో మార్కెటింగ్, సీసీఐ అధికారులు కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది. 

Videos

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

ఆపిల్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్ చేసుకోండి

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..

నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు

సర్కార్ పై గులాబీ సమరం

బాబు.. సిద్ధంగా ఉండు.. జగన్ గెలుపు ఖాయం..

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)