Breaking News

120 సమీకృత గురుకులాలు

Published on Tue, 08/20/2024 - 06:21

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సమీకృత గురుకులాల నిర్మాణానికి వెంటనే ఆయా నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లతో 30 ప్రాంతాల్లో 120 సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా స్థలాల సేకరణతో పాటు, భవనాల నమూనాలు (డిజైన్లు) పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 

గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాల్లో, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాల్లో సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని చెప్పారు. రాబోయే ఎడెనిమిది నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం  సమీక్ష నిర్వహించారు. 

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు.  ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలు వందశాతం పూర్తి చేయాలని చెప్పారు.  

ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకోవాలి  
ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకునేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 1,029 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు  మంచాలు, పరుపులు, దుప్పట్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంతమందికి ఇవి కావాలి అనే దానిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 

ప్రతి గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు తప్పనిసరిగా మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీటి సరఫరా, విద్యుత్‌ సదుపాయం ఉండేలా చూడాలని, వసతి గదులకు తలుపులు, కిటికీలు, దోమలు రాకుండా వాటికి మెష్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు.  విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై చెక్‌ లిస్టు రూపొందించి ఈనెల 29వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. చెక్‌ లిస్టును  ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు.   

ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తాం 
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి పొన్నం చేసిన విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్‌ స్కాలర్‌íÙప్‌ బకాయిల  జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 800 మంది బీసీ విద్యార్థులకు,  500 మంది చొప్పున ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తామని ప్రకటించారు. 

పెద్దాపూర్‌ పాఠశాలపై సమీక్ష 
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలను తాము సందర్శించిన తర్వాత అక్కడ తీసుకున్న చర్యలపై గురుకులాల కార్యదర్శి రమణకుమార్‌ను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. విద్యార్థులకు  మంచాలు, పరుపులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

పాఠశాల మైదానం చదును చేయాలని, నూతన భవనాల నిర్మాణం కోసం కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)