Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

Published on Thu, 12/04/2025 - 05:00

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో బుధవారం పోలీస్‌ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పు­లు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయి­స్టులు, ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పట్టిలింగం కథనం ప్రకారం.. బీజాపూర్‌–దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతం బైరంగఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేశ్‌కుతుల్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. 

దీంతో రెండు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీ­ఎఫ్‌ బలగాలు మంగళవారం సాయంత్రం నుంచి కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం కేశ్‌కుతుల్‌ అటవీ ప్రాంతంలో మావోయి­స్టులు మెరుపుదాడికి (అంబుష్‌) దిగారు. పోలీసు బలగాలపై కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. అయితే వారు ఏయే ప్రాంతాలకు చెందిన వారనేది గుర్తించాల్సి ఉంది. 

బీజాపూర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు జవాన్లు మోనూ వాడాది (హెడ్‌ కాని­స్టేబుల్‌), దుకారు గోండే, రమేష్‌ సోధీ ఎదురుకా­ల్పుల్లో మృతి చెందారు. సోమ్‌దేవ్‌ యాదవ్‌తో పాటు మరో జవాన్‌ గాయపడ్డారు. వీరిని బీజాపూర్‌ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా కూంబింగ్‌ మరింత ముమ్మరం చేసినట్లు బస్తర్‌ ఐజీ తెలిపారు. సంఘటనా ప్రాంతం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్‌ రైఫిల్, త్రీనాట్‌ త్రీ రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

ఇప్పటివరకు 275 మంది ఎన్‌కౌంటర్‌
జిల్లాలో యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగు తోందని ఐజీ తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురు­కాల్పుల్లో 275 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, దంతెవాడ సహా ఏడు జిల్లాలతో కూడిన ఒక్క బస్తర్‌ డివిజన్‌లోనే 246 మంది మరణించారు.  

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు