Breaking News

ఈసారీ యూరియా కొరత తప్పదా?

Published on Sun, 05/25/2025 - 00:52

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే వానాకాలం సాగుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పా ట్లు చేస్తోంది. వరితోపాటు పత్తి, ఇతర ఉద్యానవన పంట ల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు మరోసారి యూరియా కోసం పడిగాపులు పడే పరి స్థితి వస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వానాకాలం పంటలకు ఎరువు బస్తాల కోసం సహకార సంఘం దుకాణాల ముందు రైతులు నిలబడిన దృశ్యాలు పునరావృతం అవుతాయోమే అన్న సందేహం తలెత్తుతోంది. 

ఈ సీజన్‌లో వాడకం అధికం 
రాష్ట్రంలో ఈ వానాకాలంలో 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 5 ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌ సాగు విస్తీర్ణమే 131. 80 లక్షల ఎకరాలు. వీటిలో వరి, పత్తి, మొక్కజొన్నకు యూరియా వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఈసారి 12 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియా అవసరమ ని అధికారులు చెపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 9.8 ఎల్‌ఎంటీ యూరియానే రాష్ట్రానికి కేటాయించింది. 

గత యాసంగిలో కేటాయించిన 9.8 ఎల్‌ఎంటీల యూరియానే ఈ సీజన్‌కూ కేటాయించడం గమనార్హం. యాసంగిలో పత్తి, సోయాబీన్‌ వంటి పంటలు లేకపోయి నా 9.8 ఎల్‌ఎంటీ యూరియా సరి పోని పరిస్థితి. కానీ వానాకాలంలోనూ అంతేస్థాయిలో యూరియా కేటాయించడంతో రైతులు ఎరువుల కోసం రోడ్డె క్కే పరిస్థితి తప్పకపోవచ్చునని వ్యవ సాయ రంగ నిపుణులు చెపుతున్నారు.  

ఇప్పటి వరకు 1.72 ఎల్‌ఎంటీలే... 
ఈ వానాకాలంలో కేంద్రం ఏప్రిల్‌ నుంచి దశల వారీగా యూరియాను రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏప్రిల్‌లో 1.70 ఎల్‌ఎంటీలు, మేలో 1.60 ఎల్‌ఎంటీల చొప్పున 3.30 ఎల్‌ఎంటీలు రావలసి ఉంది. అయితే కేంద్రం ఏప్రిల్‌లో 1.20 ఎల్‌ఎంటీలు, మేలో 0.52 ఎల్‌ఎంటీలు మాత్రమే ఇచ్చింది. అంటే ఇప్పటివరకు ఇచ్చిన కోటా కేవలం 1.72 ఎల్‌ఎంటీలే. 

గత ఏడాది వానాకాలం ప్రారంభానికి ముందే 4 ఎల్‌ఎంటీల యూరియాను నిల్వ చేసినప్పటికీ, ఇబ్బందులు తప్పలేదు. కానీ ఈసారి కేవ లం 1.72 ఎల్‌ఎంటీలే కేంద్రం పంపడంతో రాష్ట్ర ప్రభు త్వం ఆందోళన చెందుతోంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అధికారులను కలిసి తక్షణం లక్ష మెట్రిక్‌ టన్నుల యూరియాను విడుదల చేయాలని కోరారు. 

ఎరువుల వాడకం తగ్గించండి..: డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, రాష్ట్రాలు ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అదే సమయంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలని కోరుతుంది. 

వానాకాలం వరి, మొక్కజొన్న వంటి పంటలకు యూరియా కీలకమని, తొలిదశలో సరిపడా యూరియా లేకపోతే మొద టి దశ నుంచే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ప్రణాళిక అవసరమని అంటున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)