Breaking News

గుండెపోటుతో టెన్త్‌ విద్యార్థి మృతి

Published on Sun, 12/08/2024 - 05:32

వనపర్తి: జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన గ్రా మస్థాయి సీఎం క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్‌ పోటీల్లో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థి వాలీబాల్‌ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పామిరెడ్డిపల్లి ముందరితండాకు చెందిన సాయి పునీత్‌ (15) బలిజపల్లి జెడ్పీ హైసూ్కల్‌లో చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి ఉదయం నుంచి క్రీడాపోటీల్లో పాల్గొన్నాడు.

పాఠశాల ఆవరణలో ఉదయం ఒకసారి కళ్లుతిరిగి పడిపోగా.. నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లి నీలమ్మ అక్కడికి చేరుకుంది. అయితే తనకు ఏమీ కాలేదని.. తల్లిని ఇంటికి వెళ్లమని పునీత్‌ చెప్పటంతో  ఆమె ఇంటికి వెళ్లిపోయింది. మళ్లీ  క్రీడల్లో పాల్గొన్న పునీత్‌ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. కాగా.. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు జిల్లా కేంద్రంతో పాటు బలిజపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)