Breaking News

Telangana: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Published on Mon, 04/03/2023 - 01:20

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే వారికి హాల్‌టికెట్లు అందాయి. మొత్తం 2,652 కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి.

సైన్స్, కాంపోజిట్‌ సబ్జెక్టులకు 20 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నారు. కోవిడ్‌ మూలంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌ ఆధారంగానే పరీక్షలు జరగ్గా ఈసారి వంద శాతం సిలబస్‌తో పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే 11 పేపర్లకు బదులు ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరగనుండటం గమనార్హం.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో ఆ తరహా అనుభవాలు ఎదురవకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించనున్నారు. మరోవైపు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. విద్యార్థులు హాల్‌ టికెట్లు చూపించి ఈ సౌకర్యం పొందొచ్చు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)