Breaking News

104 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ధర్నా 

Published on Fri, 08/25/2023 - 06:28

సుల్తాన్‌బజార్‌: తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని కోరుతూ 104 కాంట్రాక్ట్‌ ఉద్యోగులు గురువారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌ క్యాంపస్‌లో ధర్నా చేపట్టారు.  తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది 104 సిబ్బంది పాల్గొన్నారు. తమను వెంటనే రెగ్యులర్‌ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్‌ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అనంతరం యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు భూపాల్‌ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాఖలో పనిచేస్తున్న 104 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గత నాలుగు నెలలుగా 104 కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు.  అనంతరం డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.  ధర్నాలో 104 ఉద్యోగ నాయకులు సుభాష్‌చందర్, గాదె శ్రీనివాస్, వెంకన్న, నవీన్, రచ్చ రవీందర్, విద్యాసాగర్, సతీష్‌ కృష్ణప్రసాద్, ఎండీ మాజిద్‌ పాల్గొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)