Breaking News

బాలిక హత్య కేసు దర్యాప్తు ముమ్మరం

Published on Wed, 08/20/2025 - 08:32

మూసాపేట: కూకట్‌పల్లి దయార్‌గూడలో సోమవారం సహస్రిని (11) అనే బాలికను హత్య చేసిన కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈమేరకు మంగళవారం ఎస్‌ఓటీ, సీసీఎస్, పోలీస్‌ బృందాలు సుమారు 6 టీములుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. సీసీ పుటేజ్, క్లూస్‌ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించారు. కాలనీలో, భవనంలోని పలువుర్ని ప్రశ్నించారు. బాలిక ఒంటిపై సుమారు 20కి పైగా చిన్న చిన్న గాట్లు ఉన్నాయని, పదునైన చిన్నపాటి ఆయుధంతో పొడిచి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

మెడపై 14 గాట్లు, కడుపులో 6 గాట్లు ఉన్నట్లు బాలానగర్‌ డీసీపీ సురేష్‌ కుమార్‌ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కాగానే మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లాలోని వారి సొంత గ్రామానికి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు బాలిక హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. కాగా అదే భవనంలో ఉన్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుటుంబంపై చేతబడి చేశారన్న అనుమానంతో అతడు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)