Breaking News

ఒక కుటుంబంలో ముగ్గురు సర్పంచ్‌లు

Published on Tue, 12/02/2025 - 07:49

యాదాద్రి భువనగిరి జిల్లా: మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్‌ కుటుంబ సభ్యులు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మచ్చ చంద్రమౌళి తొలిసారిగా 1995లో చీకటిమామిడి గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైయ్యారు. ఐదేండ్లు ప్రజలతో మమేకమై పని చేయడంతో 2001లో సైతం రెండో సారి ఆయనను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. 2007లో చంద్రమౌళిగౌడ్‌ మాతృమూర్తి కళావతి సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 2013లో చంద్రమౌళి గౌడ్‌ సోదరుడు శ్రీనివాస్‌గౌడ్‌ ఎంపీటీసీగా గెలుపొందగా 2019లో మచ్చ శ్రీనివాస్‌గౌడ్‌ సతీమణి మచ్చ వసంత సర్పంచ్‌గా గెలిచారు. దాదాపు 20 సంవత్సరాల పాటు మచ్చ చంద్రమౌళిగౌడ్‌ కుటుంబం గ్రామానికి నిస్వార్థంగా సేవలందించి ప్రశంసలు పొందారు.

సర్పంచ్‌గా 30 ఏళ్లు..
కొండమల్లేపల్లి : రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వస్తున్న గ్రామపంచాయతీల జాబితాలో కొండమల్లేపల్లి పేరు ఉటుంది. దానిని ఆస్థాయిలో తీర్చి దిద్దిన ఘనత గ్రామ మొదటి సర్పంచ్‌ కుంభం పుల్లారెడ్డికే దక్కుతుంది. 1959లో కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఏర్పడింది. మొదటి సర్పంచ్‌గా కుంభం పుల్లారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత 1964లో రెండో సర్పంచ్‌గా నాయిని పుల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1969 నుంచి 2000 సంవత్సరం వరకు సుమారు వరుసగా 30  సంవత్సరాల పాటు కుంభం పుల్లారెడ్డి సర్పంచ్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే కొండమల్లేపల్లి పశువుల సంతను అభివృద్ధి చేశారు. దాంతో ప్రస్తుతం సంత నుంచి ప్రతి ఏటా రూ. 1.23కోట్ల ఆదాయం గ్రామపంచాయతీకి సమకూరుతోంది.

మేము డబ్బులు తీసుకోము..
ఆత్మకూర్‌(ఎస్‌) (సూర్యాపేట) : ఎన్నికల్లో డబ్బులు, మద్యం ప్రభావం అధికం. పోటీ చేసే అభ్యర్థులు ఓటుకు ఇంత అంటూ రేటు నిర్ణయించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన యల్లంకొండ వెంకట్‌రెడ్డి తన ఇంటి గోడపై రాయించిన వాల్‌ పేయింటింగ్‌ గ్రామంలో చర్చనీయాంశమైంది. ‘మేము డబ్బులు తీసుకొని ఓటు వెయ్యం.. ప్రభావితం చేసేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటాం’ అని తన ఇంటి ప్రహరీపై రాయించాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)