Breaking News

ట్రైన్‌లో పరిచయం.. ట్రాన్స్‌డెంజర్‌తో ప్రేమ.. ఇలా ఒక్కటయ్యారు

Published on Wed, 06/14/2023 - 14:36

సాక్షి, వరంగల్: ఎన్ని ఆటంకాలు వచ్చినా కల్యాణ సమయ వస్తే ఆగదంటారు పెద్దలు. అలాగే, మనిషి జీవితంలో వివాహం ఎవరితో జరగాలనేది మనిషి పుట్టినప్పుడు నిర్ణయం బడుతుందని పెద్దల నమ్ముతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మహబూబాబాద్ జిల్లాలో వింత వివాహం ఆదర్శంగా జరిగింది. ఓ యువకుడు ట్రాన్స్‌డెంజర్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరి ప్రేమను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో​ వివాహం ఘనంగా జరిగింది. 

వివరాల ప్రకారం.. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) ప్రేమించుకున్నారు. గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, బానోత్ రాధికకు రైలులో వీరూ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 

ఈ క్రమంలో రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో తమను గుర్తించాలన్నారు. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని జరగాలని కోరుకున్నారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా కల్యాణ లక్ష్మి అందజేయాలని కోరారు. వివాహ తంతులో ట్రాన్స్‌జెండర్ శోభ, రాధిక, దుర్గ, నందు, రవళి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: లండన్‌లో హైదరాబాద్‌ యువతి దారుణ హత్య

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)